గోవా లో రికార్డ్ స్థాయిలో పర్యాటకులు..చైనా ఎకానమిక్ తప్పుడు ప్రచారం…!.

గోవా…ఇది అందరికీ డ్రీమ్ డెస్టినేషన్. జీవితంలో ఒక్కసారైనా గోవా వెళ్ళాలని చాలా మంది తపిస్తుంటారు. కొంతమంది అయితే అదే పనిగా అక్కడకు వెళుతుంటారు..ఇండియాలో ఉన్నవారికే కాదు విదేశీయులకు సైతం గోవా ఫేవరెట్ టూరిజం స్పాట్. దేశదేశాల నుంచి ఇక్కడకు వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు. ఫుడ్, కల్చరల్, ప్రకృతి అందాలు…ఇలా అన్నింటిలోనూ గోవా ఫస్ట్ ఉంటుంది. పార్టీయింగ్ చేసుకోవాలంటే అక్కడకు వెళ్ళాల్సిందే. చాలామందికి వెడ్డింగ్ డెస్టినేషన్ కూడా ఇదే. అలాంటి గోవా ఈ మధ్య కాలంలో చాలా డల్ అయిపోయిందని పుకార్లు వచ్చాయి. సోషల్ మీడియా అంతా ఒకటే గగ్గోలు పెట్టింది.

రికార్డ్ స్థాయిలో పర్యాటకులు..

కానీ వాస్తవ పరిస్థితి అందుకు చాలా భిన్నంగా ఉంది. గోవా (Goa) లో టూరిజం మాంచి ఊపుమీదుందని చెబుతున్నారు. ఇంతకు ముందు కంటే ఇప్పుడు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉందని తెలుస్తోంది. హోటల్స్ అన్నీ దాదాపు బుక్ అయిపోయాయి. బీచ్లు జనాలతో నిండిపోయాయని చెబుతున్నారు. గోవాలో ఇంతకు ముందు అంతగా ప్రాచుర్యం పొందని కేరీ, కెననోనా లాంటి ప్రదేశాల్లో కూడా సందర్శకులు ఎక్కువైపోయారని అంటున్నారు. ఇక అంజునా, బాగా బీచ్ల గురించి అయితే చెప్పనే అక్కర్లేదు.
దీంతో గోవా గురించి వచ్చిన వార్తలన్నీ పుకార్లని తేలిపోయాయి. చైనా ఎకానమిక్ ఇన్ఫర్మేషన్ సెటర్ చేసిన సర్వే నిరాధారమైనది కొట్టిపడేస్తున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు కావాలని తమ వ్యూస్ను పెంచుకోవడానికి చేసిన జిమ్మిక్కని చెబుతున్నారు. ఒక్క డిసెంబర్లోనే గోవాకు 75.51 కోట్ల ఆదాయం వచ్చింది. ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో అయితే ఏకంగా 4614.77 కోట్లు రాబడి వచ్చిందని చెబుతున్నారు. ఇదంతా కేవలం పర్యాటకం ద్వారా వచ్చిన సంపాదనే అని లెక్కలు చెబుతున్నారు..

రికార్డు-బ్రేకింగ్ టూరిస్ట్ ప్రవాహం..

గోవా పర్యాటకుల రాకలో గణనీయమైన పెరుగుదలను చూసింది, హోటళ్లు దాదాపు పూర్తి ఆక్యుపెన్సీని నివేదించాయి మరియు బీచ్‌లు కార్యకలాపాలతో సందడిగా ఉన్నాయి. శక్తివంతమైన రాత్రి జీవితం, సాంస్కృతిక ఉత్సవాలు మరియు సహజమైన బీచ్‌లు సందర్శకులను ఆకర్షిస్తూనే ఉన్నాయి. నిర్జన ప్రదేశాల వాదనలకు విరుద్ధంగా, పర్యాటకులు ఇప్పుడు ఉత్తరాన కేరీ మరియు దక్షిణాన కెనకోనా వంటి అంతగా తెలియని రత్నాలను అన్వేషిస్తున్నారు, అంజునా మరియు కలంగుటే వంటి ప్రసిద్ధ ప్రదేశాలకు మించి విస్తరిస్తున్నారు.