గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు రద్దు: హైకోర్టు…!

*🔹గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు రద్దు: హైకోర్టు*

గ్రూప్-1పై హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

గతంలో ప్రకటించిన మెయిన్స్ ఫలితాలను రద్దు చేసింది.

పేపర్లను మళ్లీ మూల్యాంకనం చేయాలని, దాని ఆధారంగానే ఫలితాలు వెలువరించాలని TGPSCని ఆదేశించింది.

అది సాధ్యం కాకపోతే పరీక్ష మళ్లీ నిర్వహించాలని తెలిపింది.

అందులో ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వారందరికీ అవకాశం కల్పించాలని సూచించింది.

8 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని పేర్కొంది..

గ్రూప్-1 మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని పరీక్షలు రద్దు చేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. పరీక్షలు రద్దు చేయవద్దని ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఇరువురి పిటిషన్లపై వాదనలు విన్న న్యాయస్థానం మంగళవారం తుది తీర్పు వెల్లడించింది.

గ్రూప్-1 మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్ల తరఫు న్యాయవాదులు హైకోర్టులో బలంగా వాదనలు వినిపించారు. పరీక్షలు పారదర్శకంగా జరగలేదని, మూల్యాంకనంలో లోపాలున్నాయన్నారు. అర్హత లేని వారు మూల్యాంకనం చేశారన్నారు. 21 వేల మంది పరీక్ష రాస్తే కేవలం సుమారు 5 వేల మందివి ఏ ప్రాతిపదికన రీవాల్యుయేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరిపారని, అడుగడుగునా అవకతవకలు చోటుచేసుకున్నాయన్నారు.

కొన్ని సెంటర్లలో పరీక్షలు రాసిన అభ్యర్థులే ఎంపికయ్యారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన పరీక్షలను రద్దు చేయాలని కోరారు. అయితే.. అభ్యర్థులకు అన్యాయం జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరఫు న్యాయవాది తెలిపారు. మూల్యాంకనంలో సందేహాలున్న చోట రెండు, మూడు సార్లు మూల్యాంకనం జరిగిందన్నారు.