IPL 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం ముల్లాన్‌పూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో ఏకపక్షంగా సాగిన క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది..
బౌలింగ్, బ్యాటింగ్‌లో గుజరాత్ టైటాన్స్ సత్తా చాటింది…
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 214 పరుగుల భారీ స్కోర్ చేసింది. వైభవ్ సూర్యవంశీ(47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 96) చెలరేగగా.. రవీంద్ర జడేజా(45 నాటౌట్), డోనవన్ ఫెరీరా(38 నాటౌట్) రాణించారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో కగిసో రబాడ, జాసన్ హోల్డర్ రెండేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, కగిసో రబాడ తలో వికెట్ పడగొట్టారు.
శతక్కొట్టిన శుభ్‌మన్ గిల్..
అనంతరం గుజరాత్ టైటాన్స్ 18.4 ఓవర్లలో 3 వికెట్లకు 219 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(53 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్‌లతో 104) సెంచరీతో రాణించగా.. సాయి సుదర్శన్(32 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 58) హాఫ్ సెంచరీతో రాణించాడు.
ఈ ఇద్దరూ 167 పరుగుల భాగస్వామ్యంతో రాజస్థాన్ రాయల్స్ పతనాన్ని శాసించారు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, నండ్రే బర్గర్, బ్రిజేష్ శర్మ తలో వికెట్ తీసారు. ఈ ఓటమితో రాజస్థాన్ రాయల్స్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. ఆదివారం జరిగే ఫైనల్లో ఆర్సీబీతో గుజరాత్ టైటాన్స్ అమీతుమీ తేల్చుకోనుంది.
బుడ్డోడి కష్టం బుగ్గిపాలు
ఈ ఓటమితో రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఒంటరి పోరాటం వృథా అయ్యింది. టాపార్డర్ బ్యాటర్ల నుంచి అతనికి సరైన సహకారం లభించలేదు. వెనువెంటనే వికెట్లు కోల్పోయినా.. వైభవ్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు.
31 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన ఈ బేబీ బాస్.. మరో 15 బంతుల్లోనే 96 పరుగులకు చేరుకున్నాడు. కానీ రబాడ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగి మరోసారి 4 పరుగుల దూరంలో సెంచరీని చేజార్చుకున్నాడు. వైభవ్ కాసేపు క్రీజులో ఉన్నా.. పవర్ ప్లేలో సరైన సహకారం లభించినా ఫలితం మరోలా ఉండేది..
మైదానంలోకి వచ్చిన క్షణం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై నిర్దయాత్మకంగా విరుచుకుపడి, కేవలం 11 బంతుల్లోనే అసాధ్యమనే స్ట్రైక్ రేట్‌తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.
ముల్లాన్‌పూర్‌ను వణికించిన సిక్సర్ల వేట..
ముల్లాన్‌పూర్ వేదికగా సాగుతున్న ఈ కీలక సమరంలో రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోరు సాధించడంలో డొనొవా ఫెర్రీరా ఆడిన ఇన్నింగ్స్ అత్యంత కీలకంగా మారింది. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లలో క్రీజులోకి వచ్చిన ఈ దక్షిణాఫ్రికా విధ్వంసకర ఆటగాడు గుజరాత్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. స్టేడియం నలుమూలలా బంతిని సరిహద్దులు దాటించాడు. కేవలం 11 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ఫెరీరా, ఏకంగా 345.45 స్ట్రైక్ రేట్‌తో 38 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించి స్టేడియంలోని అభిమానులను ఉర్రూతలూగించాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్ సాయంతోనే రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 214 పరుగుల భారీ స్కోరును అందుకోగలిగింది..
ఆర్సీబీతోనే ఫైనల్ ఫైట్:.
గిల్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన జోస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్ మ్యాచ్ ని పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుని దూకుడుగా ఆడాలని ప్రయత్నించినప్పటికీ, 201 పరుగుల దగ్గర సుందర్ నాండ్రే బర్గర్ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో క్రీజులోకి వచ్చిన రాహుల్ తెవాటియా, బట్లర్ చాలా కూల్‌గా మ్యాచ్‌ను ఫినిష్ చేయడంతో.. రాజస్థాన్‌పై ఘన విజయం సాధించి రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ కి దూసుకెళ్లింది.
క్వాలిఫైయర్ 1లో ఆర్సీబీ చేతిలో దారుణంగా ఓడిపోయిన గుజరాత్.. ఇప్పుడు అదే ఆర్సీబీని ఫైనల్లో ఢీకొట్టేందుకు “రివెంజ్ మోడ్” లో రెడీ అయింది. మరి మే 31న (ఆదివారం) జరగబోయే ఫైనల్ పోరులో ఆర్సీబీ “బ్యాక్-టు-బ్యాక్” కప్పు కొడుతుందో.. లేక శుభ్‌మన్ గిల్ ఆర్మీ టైటిల్ ఎగరేసుకుపోతుందో చూడాలి మరీ.