రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం కక్ష పూరిత విధానం మార్చుకోవాలి.., పంజాబ్ లో మాదిరిగానే తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేయాలి…శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి..

నల్గొండ : నల్గొండలోని తన నివాసంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా సమావేశం.

గుత్తా కామెంట్స్…..

రెండో సారి శాసన మండలి చైర్మన్ గా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు.

ధాన్యం కొనుగోలుపై రాష్ట్రంలో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు కేంద్రం మానుకోవాలి.

యాసంగి ధాన్యం కొనుగోలు సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం మార్గం చూపించాలి.

దేశంలో ఉన్న రైతులందరినీ కాపాడాల్సిన బాధ్యత కేంద్రం పైనే ఉంది.

రాష్ట్ర ప్రభుత్వంపై కక్ష పూరిత విధానాన్ని మార్చుకుని, పంజాబ్ లో మాదిరిగానే తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేయాలి.