హన్మకొండలో చైన్ స్నాచింగ్…
నగరంలోని ఎక్సైజ్ కాలనీలో ఉదయం ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా మెడలోని బంగారు చైన్ లాక్కెళ్లిన దుండగులు..
దుండగున్ని ఆపే ప్రయత్నం చేయగా, బైక్ పై పరార్..
సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు మామిండ్ల నవ్య..
సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు..
దుండగుల కోసం గాలిస్తున్న పోలీసులు..
ఈ ఘటనతో బాధితురాలు మామిండ్ల నవ్య ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. దొంగలను పట్టుకునేందుకు బైక్ వెనుక కొద్దిదూరం ఆమె పరిగెత్తింది. కానీ లాభం లేకుండాపోయింది. ఈ చోరీపై బాధితురాలు నవ్య.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని వివరాలను సేకరించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. అందులో నవ్య మెడలో నుంచి గోల్డ్ చైన్ లాక్కెళ్లడం, వారి వెంట నవ్య పరిగెత్తడం స్పష్టంగా రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది…