ఓట‌ర్లు చైత‌న్యం, భారీగా పొలింగ్ కేంద్రాలకు వ‌చ్చి ఓటుహక్కును వినియోగించుకున్నారు.. మంత్రి హ‌రీశ్‌రావు.

ఓట‌ర్లు చైత‌న్యం చాటార‌ని, పోలింగ్ కేంద్రాల‌కు వ‌చ్చి ఓటుహక్కును వినియోగించుకున్నార‌ని మంత్రి హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. హుజూరాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లంద‌రికీ ఆయ‌న‌ ధన్యవాదాలు తెలిపారు. నాలుగు నెలలుగా పార్టీ గెలుపు కోసం పార్టీ నేతలు, కార్యకర్తలు ఎంతో కష్టపడ్డార‌ని, వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్న‌ట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ గారి మార్గదర్శకం, హుజూరాబాద్‌ ప్రజల ఆశీర్వాదంతో గొప్ప విజయం సాధించబొతున్నామని తెలిపారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సహకరించిన పార్టీ కార్యకర్తలను అభినందించారు…