మున్సిపల్ బడ్జెట్ పై సన్నద్ధం కావాలి…ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ..

రాష్ట్రంలో కొత్తగా 20 బ్లడ్ స్టోరేజీ సెంటర్లు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా, జ్వర సర్వే, వాక్సినేషన్ అంశాలపై సోమవారం వైద్యారోగ్య అధికారులతో మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కరోనా కట్టడి కోసం మొదలు పెట్టిన ఫీవర్‌ సర్వే రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతుందన్నారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఒకవైపు కొత్త ఆసుపత్రులు, కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు తో పాటు, మరో వైపు ఉన్న ఆసుపత్రులను ఆధునికీకరణ చేసే ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు…ప్రజలకు ఉచిత, నాణ్యమైన వైద్యం అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.10.84 కోట్లతో దవాఖానలకు మరమ్మతులు చేస్తున్నామన్నారు. మున్సిపల్ బడ్జెట్ పై సన్నద్ధం కావాలని అధికారులకు సూచించారు. ప్రత్యేకంగా కౌన్సిల్ సమావేశాలు నిర్వహించాలని పేర్కొన్నారు. మ్యాచింగ్ ఫండ్, పట్టణ ప్రగతి నిధులు పరిగణలోకి తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పదిశాతం గ్రీన్‌ బడ్జెట్‌ నిధులు తప్పని సరిగా ఉండేలా చూడాలన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని మంత్రి హరీష్‌ రావు తెలిపారు…