‘దసరాకు ఇస్తమన్నరు.. ఇవ్వలేదు. సంక్రాంతికి ఇస్తమన్నరు.. ఇవ్వలేదు. ఉగాదికి ఇస్తమని ఊరించి చివరికి రైతులను ఉసూరు మనిపించిండ్రు.. కొత్త సంవత్సరం రైతులకు చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేకి’ ఆని హరీశ్ తూర్పారపట్టారు. ‘రైతులను ఇంకా ఎన్నాళ్లు మోసం చేస్తవ్ రేవంత్రెడ్డీ’ అని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో నాట్ల సమయంలో రైతు బంధు ఇస్తే, రేవంత్ రెడ్డి కోతల నాటికి కూడా రైతు భరోసా ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. మోసమే తన విధానంగా మార్చుకున్న రేవంత్రెడ్డి.. రైతులను అన్ని విధాలుగా దగా చేస్తున్నాడని నిప్పులు చెరిగారు. ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అడుగు ముందుకు పడుతలేదు.. డేట్లు మాత్రం మారుతున్నయి.. డెడ్లైన్లు మారుతున్నయి తప్ప రైతులకు ఇచ్చిన హామీలను మాత్రం సర్కారు నెరవేర్చడం లేదు’ అని విమర్శించారు. రుణమాఫీ చేసేదాకా.. రైతు భరోసా ఇచ్చేదాకా ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వెంటాడుతూనే ఉంటుందని, ఎకడికకడ నిలదీస్తూ, వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉంటుందని హెచ్చరించారు..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.