షేమ్‌.. షేమ్‌.. రేవంత్‌రెడ్డి.. ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రిని చూసి నేర్చుకో..’ అని హరీశ్‌రావు వ్యాఖ్యాలు…!

ఎన్నికల సమయంలో ఆడబిడ్డలకు ప్రతినెలా డబ్బులిస్తానని ఆశజూపి ఓట్లు వేయించుకున్నావ్‌.. ఇప్పటివరకు ఇయ్యనేలేదు..షేమ్‌.. షేమ్‌.. రేవంత్‌రెడ్డి.. ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రిని చూసి నేర్చుకో..’ అని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ‘2024 డిసెంబర్‌ 9న ఝార్ఖండ్‌ సీఎంగా పగ్గాలు చేపట్టిన హేమంత్‌ సోరెన్‌.. నెలరోజులు కాకముందే తన మాట ప్రకారం ‘మాయీ సమ్మాన్‌’ పథకం కింద మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తున్నారు. అదే మీరు ఎన్నికల సమయంలో మహాలక్ష్మి పేరిట ప్రతినెలా మహిళలకు రూ.2500ఇస్తామని చెప్పిన మొట్ట మొదటి హామీకే దిక్కులేకుండా పోయింది’ అని ‘ఎక్స్‌’లో విమర్శించారు. 125ఏళ్ల పార్టీకి చెందిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం పదవిలోకి వచ్చి 13 నెలలు అవుతున్నా మహాలక్ష్మి పథకం అమలు చేయలేకపోయారని మండిపడ్డారు…