టిప్పర్ లారీ ఢీకొని జయశంకర్ భూపాలపల్లి డీటీవో వెంకన్న మరణించడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు అనుమానం వ్యక్తం…!

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విధి నిర్వహణలో ఉన్న మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ (MVI) వెంకన్న మృతి తీవ్ర విషాదాన్ని నింపింది. సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోవడం జిల్లాతో పాటు రవాణా శాఖలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. వెంకన్న మృతికి కారణమైన వాహనం తాడిచర్ల కోల్ మైన్ నుంచి భూపాలపల్లి థర్మల్ పవర్ స్టేషన్‌కు బొగ్గును తరలిస్తున్న బొగ్గు టిప్పర్అధికారులు గుర్తించారు.

ఘటనపై హరీష్ రావు అనుమానం వ్యక్తం.

బొగ్గు టిప్పర్ లారీ ఢీకొని జయశంకర్ భూపాలపల్లి డీటీవో వెంకన్న మరణించడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు అనుమానం వ్యక్తం చేశారు. వెంకన్న ప్రమాదం వెనుక దాగిన నిజాన్ని వెలికితీయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. అధికారులను బెదిరిస్తూ అక్రమ దందాలు సాగిస్తున్న ఇసుక మాఫియా, బొగ్గు మాఫియాలకు అడ్డొస్తే లారీలతో తొక్కించి చంపిస్తారా అని మండిపడ్డారు.

అధికారులను బెదిరిస్తూ అక్రమ దందాలు సాగిస్తున్న ఇసుక మాఫియా, బొగ్గు మాఫియా వివరాలను బయటపెట్టాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. డీటీవో వెంకన్న మరణం వెనుక ఉన్న వాస్తవాలను ప్రజల ముందుంచాలన్నారు. సమగ్ర విచారణ జరిపి దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు..