గతంలో టికెట్ కోసం కేటీఆర్ కాళ్లు మొక్కినావ్ మైపంపల్లి..రాపోలు నవీన్ కుమార్*.
స్థానిక నేరేడుచర్ల పట్టణ కేంద్రం నందు బిఆర్ యస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద నోరు పారెసుకున్న మైనంపల్లి హనుమంతరావు దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం బిఆర్ యస్వి నియోజకవర్గ మాజీ అధ్యక్షులు పల్లెపంగా నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమం లో బిఆర్ యస్వి మాజీ రాష్ట్ర నాయకులు రాపోలు నవీన్ కుమార్ మాట్లాడుతూ
బీఆర్ఎస్ చేతిలో ఘోర పరాజయం పాలైన
మైనంపల్లి హనుమంతరావు పూర్తిగా నిరాశ, నిస్పృహల్లో మునిగిపోయి, మతిస్థిమితం లేనట్లు మాట్లాడుతున్నాడు ఈరోజు నువ్వు భజన చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆయనను ‘తీన్ ఫీట్’ అంటూ తిట్టి, అవమానించింది నువ్వే కదా మైనంపల్లి గతంలో టికెట్ కోసం కేటీఆర్ గారి కాళ్లు మొక్కినావ్..టికెట్ రాలేదని పార్టీ వదిలేసి వెళ్ళిపోయావు నీకు రాజకీయ భిక్షపెట్టిన కేటీఆర్ గారిపైనే కేవలం పదవుల కోసం, నీ స్వార్థ నీచ రాజకీయాల కోసం అడ్డగోలు ఆరోపణలు చేస్తావా
అని దుయ్య బట్టారు ఈ కార్యక్రమం లో యువజన నాయకులు పెరుమాళ్ళ సతీష్ కుమార్
రామ్ సైదులు తకెళ్ళ నాగార్జున పోలే అనిల్ కుమార్ గంగ రాజు షేక్ నాగుల్ మీరా దిరావత్ శివనాయక్ ఇంజమూరి శంకర్ నందీపాటి జకన్న కనుకు టోనీ నకిరేకంటి రమేష్ బండి కార్తీక్ వినయ్ సాయి తదితరులు పాల్గొన్నారు.