హరీష్ రావుని అరెస్ట్ చేసిన పోలీసులు..తోపులాటలో కింద పడిపోయిన హరీష్ రావు..!

హరీష్ రావుని అరెస్ట్ చేసిన పోలీసులు..

తోపులాటలో కింద పడిపోయిన హరీష్ రావు

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత..

ప్రజాస్వామ్యంలో ఉన్నామా పోలీసుల పహారాలో ఉన్నమా అంటూ ప్రశ్నించిన హరీష్ రావు..

అక్రమ అరెస్టులతో ఏం సాధిస్తారు అంటూ ప్రశ్న..

గురుకులాల్లో టెండర్లలో(Gurukulala tenders) అవినీతి ఆరోపణలపై చర్చల్లో ట్విస్టు చోటు చేసుకుంది. కేటీఆర్‌, హరీశ్ రావు(Harish Rao) గన్‌పార్క్‌కు రావాలని మంత్రులు సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో గురుకులాల్లో అవినీతిపై చర్చకు హరీశ్ రావు సిద్ధమయ్యారు. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌తో కలిసి గన్‌పార్క్‌ బయలు దేరారు. గురుకులాలపై చర్చకు మేము ప్రెస్‌క్లబ్‌ రమ్మంటే మంత్రులు గన్‌పార్క్‌ రమ్మన్నారు…మాకు ఎలాంటి భేషజాలు లేవు. మీరు రమ్మన్నారు మేము వస్తున్నామని తెలిపారు. చర్చకు ఎక్కడికైనా మేము సిద్ధమని పేర్కొన్నారు. ఎలాంటి గొడవలు వద్దు కూర్చొని మాట్లాడుకుందామన్నారు. డ్రగ్స్‌ సరఫరా చేసే వారికి టెండర్లు ఇచ్చారని ఆరోపించారు. ఒకవేళ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలంగాణ భవన్‌కు వెళ్తే..కేటీఆర్‌ చర్చించేందుకు రెడీ ఉన్నారని పేర్కొన్నారు..

మంత్రుల ఆహ్వానం మేరకు గన్‌పార్క్‌ బయలు దేరిన హరీశ్‌ రావు, బీఆర్ఎస్ నాయకుల బృందాన్ని తెలంగాణ భవన్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. బలవంతంగా నెట్టేయడంతో హరీశ్‌ రావు కిందపడిపోయారు. దీంతో పోలీసుల తీరుపై బీఆర్‌ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు…ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు, బీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో ఉద్రికత్త పరిస్థితులు చోటు చేసుకొన్నాయి. పోలీసుల తీరు నిరసిస్తూ తెలంగాణ భవన్ ఎదుట రోడ్డుపై హరీశ్‌ రావు, బీఆర్ఎస్ నాయకులు బైఠాయించి ఆందోళన చేపట్టారు..