భూముల వివాదంలో రేవంత్ సర్కార్‌కు షాక్.. సుప్రీంకోర్టు చురకలు..

Hcu భూముల వ్యవహారంలో అధికార పార్టీకి షాక్ తగిలింది…
భూముల వివాదంలో రేవంత్ సర్కార్‌కు షాక్.. సుప్రీంకోర్టు చురకలు.

Hcu 400 ఎకరాల భూమి వివాదంపై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా జస్టీస్ గవాయ్‌ ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది..

రాష్ట్ర ప్రభుత్వం (State Government)తో పాటు ఎంపవర్డ్‌ కమిటీ (Empowered Committee)ని అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించగా.. ఈ మేరకు ఇవాళ జస్టిస్‌ బీఆర్‌ గవాయి (Justice BR Gavai), జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్‌ (Justice Augustine George Masih)తో ద్విసభ్య ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. అయితే, విచారణ సందర్భంగా కంచ గచ్చిబౌలి (Kacha Gachibowli) భూముల్లో చెట్ల నరికివేతపై కోర్టు మరోసారి సీరియస్ అయింది.

ఇష్టానుసారంగా చెట్లను నరికి సమర్ధించుకోవడం ఏంటని జస్టిస్ బీఆర్ గవాయి ప్రభుత్వం తరఫు న్యాయవాదిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చెట్ల పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఓ ప్రణాళికతో రావాలని ఆదేశించారు. పర్యవరణ పరిరక్షణలో తాము ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. చెట్ల నరికివేత విషయంలో రాష్ట్ర సీఎస్‌ (CS)తో సంబంధిత అధికారులు జైలుకు వెళ్తారని.. ఒకవేళ వారిని కాపాడాలనుకుంటే విధ్వంసం సృష్టించిన 100 ఎకరాలను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని కోర్టు ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. చెట్ల పునరుద్ధరణను ప్రభుత్వ అధికారులు వ్యతిరేకిస్తే.. ఆ భూముల్లోనే టెంపరరీ జైలును కట్టి వారిని అందులోకి పంపుతామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ నోటీసులో లేకుండా వివాదాస్పద భూమిలో ఒక్క చెట్టు కూడా నరకొద్దని.. తాము తీర్పు ఇచ్చాక కూడా ఆ ప్రాంతంలో ఇంకా బుల్డోజర్లు ఎందుకున్నాయంటూ కోర్టు ఆక్షేపించింది.

ఈ క్రమంలోనే ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు బదులిస్తూ.. ఏఐతో రూపొందించిన ఫేక్ వీడియో (Fake Video)లతో విపక్షాలు ప్రభుత్వంపై సోషల్ మీడియా (Social Media)లో విపరీతంగా దుష్ప్రచారం చేశాయని ధర్మాసనానికి విన్నివించారు. మినహాయింపునకు లోబడే చెట్లను తొలగించామని పేర్కొన్నారు. ఆ భూముల్లో ప్రస్తుతం అన్ని పనులను ఎక్కడికక్కడే నిలిపివేశామని పేర్కొన్నారు. భవిష్యత్తులో రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతవం కానివ్వకుండా చూసుకుంటామని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే, వాదోపవాదాలు విన్న ధర్మాసనం తీర్పు విషయంలో స్టేటస్ కో (Status Co) కొనసాగుతుందని తెలిపింది. అదేవిధంగా తదుపరి విచారణను మే 15కు వాయిదా వేస్తున్నట్లుగా తెలిపింది. అదేవిధంగా భూముల్లో పర్యవరణాన్ని ఎలా పునరుద్ధరిస్తారు..? ఎంతకాలంలో ఆ పనులు పూర్తి చేస్తారు, జంతువులను ఎలా సంరక్షిస్తారు వంటి అంశాలపై ప్రణాళికను 4 వారాల్లోగా ఫైల్ చేయాలని కోర్టు మద్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది…

చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దని చెప్పింది. చెట్లు నరికేందుకు పర్మిషన్ తీసుకోకపోతే అధికారులను జైలుకు పంపుతామని హెచ్చరించింది. అలాగే చీఫ్ సెక్రటరీ శాంతి కుమారిని కాపాడాలనుకుంటే నరికివేసిన ఆ 100 ఎకరాల్లో చెట్లను ఎలా పునరుద్ధరిస్తారో ఓ ప్రణాళికతో రావాలని ఆదేశించింది. చివరికి మే 15కు విచారణను వాయిదా వేసింది. స్టేటస్‌ కో ను అలాగే కొనసాగించాలని స్పష్టం చేసింది.

”సిటీలో గ్రీన్‌ లంగ్ స్పేస్ ఉండాలి. చెట్ల నరికివేతకు పర్మిషన్ తీసుకున్నారా ? లేదా ? సూటిగా సమాధానం చెప్పండి. అభివృద్ధి జరగాలి.. కానీ అడవులను నాశనం చేయకూడదు. పర్యావరణ పరిరక్షణ విషయంలో రాజీ లేదు. ప్రైవేట్‌ ఫారెస్ట్‌లో చెట్లు నరికివేసినా సీరియస్‌గా తీసుకుంటాం. అనుమతులు లేకుండా చెట్లు కొట్టేసినందుకు సీఎస్ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుంది. సెల్ఫ్ సర్టిఫికెట్ చేసుకొని అన్నింటికీ మినహాయింపులు ఇచ్చుకున్నారు, ఇది సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్ధం. భూముల తాకట్టు అంశంతో మాకు సంబంధం లేదు. కేవలం నరికిన చెట్లను ఎలా పునరుద్దన చేస్తారనేదే మా ప్రాధాన్యత.

1996 డిసెంబర్ లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏమాత్రం వ్యవహరించినా చూస్తూ ఊరుకొము. భూములను తాకట్టు పెట్టారా లేదా అమ్ముకున్నారో లేదో మాకు అనవసరం. చెట్లు కొట్టేసే ముందు అనుమతి ఉందా లేదా అనేది ముఖ్యం. మీరు అభివృద్ధి చేసుకోవాలనుకుంటే తగిన అనుమతులు తీసుకోండి. వంద ఎకరాల్లో జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చాలి అన్న విషయం పైనే మేము దృష్టి సారించామని” జస్టిస్ గవాయ్‌ ధర్మాసనం తెలిపింది.

ఇదిలాఉండగా.. ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని తెలంగాణ సర్కార్‌ మంగళవారం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో తెలిపింది. అది అటవీభూమి కాదని.. పూర్తిగా ప్రభుత్వ భూమేనని స్పష్టం చేసింది. రెండు దశాబ్దాలుగా దీనిపై న్యాయవివాదం కొనసాగడంతో ఆ ప్రాంతాన్ని ఖాళీగా వదిలేయడం వల్ల చెట్లు పెరిగాయని తెలిపింది. ప్రభుత్వం అక్కడ అభివృద్ధి చేస్తే పెట్టుబడులు ఆకర్షించి వేగంగా ఉద్యోగాల సృష్టికి వీలవుతుందని చెప్పింది.

”ఈ భూమి ఓపెన్‌గా ఉండటం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జంతువులు వచ్చివెళ్తున్నాయి. సెంట్రల్ యూనివర్సిటీ, ఇది కలిపి ఉన్న 2 వేల ఎకరాల్లో జంతువులు తిరుగుతాయి, కానీ వీటికి ఇక్కడ ఆవాసం లేదు. ఈ ప్రాంతంలో అభివ-ృద్ధి కార్యక్రమాలు చేపట్టిన తర్వాత వాటిని ఇబ్బంది పెట్టకుండా చర్యలు తీసుకుంటాం. ఇక్కడ కొట్టేసిన చెట్లు నిషేధిత విభాగంలోకి రావు. అవసరమైతే ఇందుకోసం ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయిస్తాం. అక్కడ మొక్కల్ని పెంచుతామని” రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.