భార్యతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన వ్యక్తి.. పాట పూర్తి కాగానే గుండెపోటుతో మృతి..!

భార్యతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన వ్యక్తి.. పాట పూర్తి కాగానే గుండెపోటుతో కుప్పకూలి మరణించాడు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం పెదగాడి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్‌గా పనిచేసే అప్పికొండ త్రినాథ్‌ (56) తన భార్య లక్ష్మీతో కలిసి అమ్మవారి నిమజ్జనం సందర్భంగా జరిగిన ఊరేగింపులో డ్యాన్స్ చేశారు. పాట పూర్తి కాగానే గుండెపోటుతో కుప్పకూలి మరణించారు. అయితే పాట పూర్తయిన కాసేపటికే త్రినాథ్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గ్రామస్థులు అతడిని హాస్పిటల్‌కు తీసుకెళ్లగా ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆ వార్త విని కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారు. పండగ వేళ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి..