కుంగిన భారీ వంతెన-హిమాచల్లో 298 మంది బలి.!

ఉత్తరాది రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. వరద ఉద్ధృతికి లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. జమ్మూ- పఠాన్‌కోట్‌ జాతీయ రహదారిపై ఉన్న కీలకమైన వంతెన దెబ్బతింది. సమీపంలో ఉన్న సహర్‌ ఖడ్‌ నది ఉప్పొంగడంతో ప్రధాన వంతెన కుంగింది. జమ్మూలో గత 24 గంటల్లో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. భారీ వర్షాల ధాటికి నదులు, కాలువలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి.

చిక్కుకున్న 45 మంది విద్యార్థులు!.

పలు ప్రాంతాల్లో వరదనీరు ఇళ్లలోకి చేరింది. డజన్లకొద్ది వాహనాలు వరద ఉద్ధృతికి కొట్టుకుపోయాయని అధికారులు తెలిపారు. ఎడతెగని వర్షాలతో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటిగ్రేటివ్‌ మెడిసిన్‌ వసతి గృహంలోకి వరద చేరగా 45 మంది విద్యార్థులు అక్కడ చిక్కుకున్నారు. హాస్టల్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌ వరదనీటితో మునిగిపోయిందని అధికారులు చెప్పారు. IIIM వద్దకు చేరుకున్న పోలీసులు, ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఐదు గంటలపాటు శ్రమించి బోట్ల ద్వారా విద్యార్థులందరనీ సురక్షిత ప్రాంతానికి తరలించారు..వర్షాలు పడతాయని ముందే ఊహించాం. వర్షం ప్రారంభమైన వెంటనే శాస్త్రీయ విభాగంలోని నాలుగు బ్లాక్‌ల గ్రౌండ్ ఫ్లోర్ నుంచి విద్యార్థులను ఇప్పటికే తరలించారు. వర్షాలు ఆగకపోవడంతో మొత్తం ప్రాంతం మునిగిపోయింది. వరదలకు కారణం తెలియదు. స్థానికంగా ఉన్న చెరువు కూడా నిండిపోయింది. విద్యార్థుల బస, ఆహారం కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం” అని IIIM డైరెక్టర్ డా.జబీర్ అహ్మాద్ వెల్లడించారు..అయితే ఈ నెల 27 వరకు వాతావరణశాఖ అంచనా వేసింది. అదే సమయంలో జమ్మూకశ్మీర్లోని వివిధ ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సంబంధిత అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆదేశించారు. ఆగస్టు 27 వరకు ఎత్తైన ప్రాంతాలలో మేఘావృతాలు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే అవకాశంతో పాటు తీవ్రమైన వర్షపాతం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు..

Heavy rains in North India..

ఇప్పటి వరకు 298 మంది బలి!.

మరోవైపు, హిమాచల్ ప్రదేశ్లో జూన్ 20న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 298 మంది ప్రాణాలు కోల్పోయారని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ఆదివారం తెలిపింది. ఎస్డీమీఏ నివేదిక ప్రకారం, 298 మరణాల్లో 152 వర్షాలు, కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు, ఇళ్లు కూలిపోవడం, ఇతర వాతావరణ ప్రభావాల వల్ల సంభవించాయి. అదే సమయంలో 146 మరణాలు రోడ్డు ప్రమాదాల్లో సంభవించాయి..

వరదల్లో చిక్కుకున్న 500 మంది!.

రాజస్థాన్‌లో కొన్ని ప్రాంతాల్లో 24 గంటల వ్యవధిలోనే 50 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైనట్టు వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. కుండపోత కారణంగా ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయినట్టు చెప్పారు. తూర్పు రాజస్థాన్‌లోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగి చెరువులను తలిపిస్తున్నాయి. వరద ఉద్ధృతికి పలుచోట్ల రహదారులు, వంతెనలు ధ్వంసమయ్యాయి. బుండి జిల్లాలో డజన్ల కొద్ది ఇళ్లు కులిపోయాయని కలెక్టర్‌ తెలిపారు. వరదల్లో చిక్కుకున్న 500 మందిని తరలించేందుకు సహాయక బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. సవాయ్‌ మాధోపూర్‌, రణథంభోర్‌లోని ప్రాంతాల్లో నడుముల్లోతు నీళ్లు చేరడంతో జనజీవనం స్తంభించింది. మాధోపూర్‌లో కుండపోత కారణంగా భూమి కుంగి అక్కడ వరద నీరు ప్రవహించడంతో ఆ ప్రాంతం చిన్నసైజు జలపాతంలా కనిపిస్తోంది…