పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ను ఎర్డోగాన్ కలిసిన విషయం తెలిసిందే. పర్యాటకుల మృతిపై సానుభూతి వ్యక్తం చేయలేదు. దీంతో ఈ విషయం ఇండియాలో తీవ్ర విమర్శలు వస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఈ విషయంపై టాలీవుడ్ హీరో నిఖిల్(Nikhil Siddharth) ట్విట్టర్ ద్వారా స్పందించారు. అంతేకాకుండా అభిమానులకు కీలక సూచన చేశాడు. ఓ నెటిజన్ పెట్టిన పోస్ట్పై తనదైన స్లైల్లో రిప్లై ఇచ్చాడు. ”ఇంకా ఎవరైనా తుర్కియే వెళ్లాలనుకుంటున్నారా? దయచేసి ఒక్కసారి ఈ పోస్ట్ చూడండి. భారతీయులు ప్రతి ఏడాది తుర్కియేలో పెద్దమొత్తంలో ఖర్చు పెడుతుంటారు.
మన దేశానికి వ్యతిరేకంగా వ్యవహరించే వారి కోసం మీ డబ్బు ఖర్చు పెట్టడం దయచేసి మానండి” అని రాసుకొచ్చారు. కాగా, నిఖిల్ సినిమాల విషయానికొస్తే.. ఆయన నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘స్వయంభూ’. భరత్ కృష్ణమాచారి(Bharat Krishnamachari) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్(Samyuktha Menon), నభా నటేష్(Nabha Natesh) హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా ఠాగూర్ మధు సపర్పణలో శ్రీకర్, భువన్ నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం 2023లోనే ప్రకటించి షూటింగ్ కూడా మొదలు పెట్టినప్పటికీ విడుదల మాత్రం కాలేదు. గత రెండేళ్ల నుంచి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.