🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌷పంచాంగం🌷
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 26 – 08 – 2025,
వారం … భౌమవాసరే ( మంగళవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
వర్ష ఋతువు,
భాద్రపద మాసం,
శుక్ల పక్షం,
తిథి : *తదియ* మ12.36 వరకు,
నక్షత్రం : *హస్త* తె5.46 వరకు,
యోగం : *సాధ్యం* మ1.14 వరకు,
కరణం : *గరజి* మ12.36 వరకు,
తదుపరి *వణిజ* రా1.18 వరకు,
వర్జ్యం : *మ1.00 – 2.45,*
దుర్ముహూర్తము : *ఉ8.17 – 9.07,*
మరల *రా10.53 – 11.39,*
అమృతకాలం : *రా11.19 – 1.02,*
రాహుకాలం : *మ3.00 – 4.30,*
యమగండం : *ఉ9.00 – 10.30,*
సూర్యరాశి : సింహం,
చంద్రరాశి : కన్య,
సూర్యోదయం : 5.48,
సూర్యాస్తమయం: 6.17,
*_నేటి మాట_*
*జన్మ… శక్తి…!!*
ఆకాశంలో ఒక గ్రద్ద ఆహారం కోసం చూస్తుండగా ఒక నక్క ఎరలతో నిండిన బండి లాగుతూ వెళ్తోంది.
పై నుండి దీన్ని చూసిన గ్రద్ద రయ్యిమని ఆ నక్క ముందు వాలి..
ఆ ఎరలు కావాలని నక్కను అడిగింది.
అప్పుడు ఆ నక్క తప్పకుండా ఇస్తాను.
కానీ దానికి కొంత వెల అవుతుంది అంది.
దానికి ఆ గ్రద్ద సరే ఏమివ్వాలీ, ఎంత కావాలి అని అడిగితే, నీ రెండు ఈకలు ఇస్తే నేను ఒక ఎరను ఇస్తాను అని నక్క చెప్పింది.
గ్రద్ద తన రెండు ఈకలు పీకి ఇచ్చింది.
నక్క వాటిని తీసుకుని ఒక ఎరను తీసి ఇచ్చింది.
దాన్ని తింటూ ఆహ ఎంత రుచిగా ఉంది.
మల్లీ ఇంకొకటి తిందాం అని మళ్ళీ నక్క దగ్గరకు వచ్చింది ఆ గ్రద్ద.
అలా రుచి మరిగి మళ్ళీ మళ్ళీ తన ఈకలనిచ్చి ఎరలను కొనుక్కుని తింటుంది ఆ గ్రద్ద.
చివరికు..
ఆ గ్రద్ద ఈకలన్నీ అయిపోయాయి.
అప్పుడు ఒక్కసారిగా నక్క పెద్దగా నవ్వింది.
గ్రద్ద తేరుకొని, నిజం తెలుసుకొనే లోగ తన ఈకలన్ని ఊడి, పైకి ఎగరలేకపోయింది.
నక్క అమాంతం గ్రద్ద పైబడి చీల్చి తినేసింది.
_విచక్షణ కోల్పోయి శక్తినంతా అమ్ముకుని దేవుడిచ్చిన ఆ ఎగిరే శక్తిని కోల్పోయి చివరకు ప్రాణాలు విడిచింది ఆ గ్రద్ద._
సరిగ్గా.. ఇలానే..
మానవుని జీవితంలో కుడా కొన్ని విషయాలు ఆకర్షించి, కొన్ని విషయాలు ప్రలోభపెట్టి మానవునికి తాత్కాలిక ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఇచ్చే విషయాలే మానవుని పాలిట విషప్రాయాలై వారి జీవితాలను విషాదంలో ముంచేస్తాయి.
అందుకే..
ప్రతి మానవుడు కూడా ఆ పరమేశ్వరుడు తనకు ఇచ్చిన ఈ మానవ జన్మ యొక్క శక్తి తెలుసుకొని..
ఎటువంటి ఆకర్షణలకు, ప్రలోభాలకు లోంగకుండా.. ఎల్లప్పుడు భక్తి శ్రద్ధలతో.. ఆధ్యాత్మిక చింతనతో ఆ పరమేశ్వరునిలో మమేకమైపోవటానికి ప్రయత్నించాలి…
*_🌷శుభమస్తు🌷_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏