బైండోవర్ నిబంధనలు ఉల్లంఘన..
ముగ్గురిపై కేసులు, MRO ముందు హాజరు
హుజూర్నగర్ పట్టణంలో బైండోవర్ నియమ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తులపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. గతంలో పీర్లచవిడి ప్రాంతంలో గొడవలకు పాల్పడిన వ్యక్తులపై పోలీసులు ముందస్తుగా బైండోవర్ కేసులు నమోదు చేసి, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
పీర్లచవిడి వద్ద జరిగిన గొడవలకు సంబంధించి
1) కుంచరాపు శ్రీకాంత్ (తండ్రి: కొటయ్య),
2) తమ్మిశెట్టి నర్సింహా (తండ్రి: గిరి),
3) మహమ్మద్ షారుఖాన్ (తండ్రి: నాజీరుద్దీన్) అనే ముగ్గురిని హుజూర్నగర్ ఎంఆర్ఓ ఎదుట హాజరుపరిచి, సద్భ్రవర్తనతో ఉంటామని, శాంతి భద్రతలకు భంగం కలిగించమని హామీ తీసుకొని ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున బైండోవర్ విధించడం జరిగింది..
అయితే, ఈ ముగ్గురు వ్యక్తులు తేదీ 01-01-2026 న మరోసారి ఇరువర్గాల మధ్య గొడవలకు పాల్పడి బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వారిపై మరలా కేసులు నమోదు చేసి, ఒక్కొక్కరికి రూ.2 లక్షల జరిమానా సొత్తు చెల్లించే విధంగా చర్యలు తీసుకున్నారు. జరిమానా చెల్లించని పక్షంలో ఆరు నెలల జైలు శిక్ష విధించేలా ఈరోజు హుజూర్నగర్ ఎంఆర్ఓ ఎదుట ఫోర్ఫిట్ (బైండ్-డౌన్) ప్రక్రియ కోసం హాజరుపరిచినట్లు తెలిపారు.
ఇకపై ఎవరైనా బైండోవర్ నియమ నిబంధనలు ఉల్లంఘించినట్లయితే, జరిమానా సొత్తు ఫోర్ఫిట్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు. హుజూర్నగర్ పట్టణ ప్రజలు శాంతి భద్రతలను కాపాడడంలో పోలీసులకు సహకరించాలని హుజూర్నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. చరమంద రాజు విజ్ఞప్తి చేశారు.
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959