హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్త వార్తలు…

*పాలకవీడు తహసీల్దార్ బాధ్యతలు స్వీకరణ*

*కె సి ప్రమీల బాధ్యతలు చేపట్టారు*

పాలకవీడు మండల తహసీల్దార్‌గా కె సి ప్రమీల బాధ్యతలు స్వీకరించారు. మండల కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు చేపట్టి రికార్డులు పరిశీలించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. మండల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు..

*పిపిసి కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి*

పిపిసి కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు మరింత వేగవంతం చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హమాలి, రవాణా ఏర్పాట్లు సమర్థవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు వాకాటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. సూర్యాపేట కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హాజరయ్యారు.
రాష్ట్రవ్యాప్తంగా పిపిసి కేంద్రాలకు 21.34 లక్షల మెట్రిక్ టన్నుల వరి చేరగా, ఇప్పటివరకు 13.32 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. తడిసిన వరిని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని సూచించారు.
పిపిసి కేంద్రాల్లో తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, నీడ సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో రైతులకు హెచ్చరికలు అందించాలని, టార్పాలిన్‌లు సిద్ధంగా ఉంచాలని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 1.39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, 1.31 లక్షల మెట్రిక్ టన్నులు మిల్లులకు తరలించినట్లు కలెక్టర్ తెలిపారు. ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ.100 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు..

ప్రజల సమస్యల పరిష్కారమే ద్వేయంగా ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం..ఆర్డీవో శ్రీనివాసులు

ప్రజల సమస్యల పరిష్కారమే ద్వేయంగా ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని హుజూర్ నగర్ ఆర్డీవో శ్రీనివాసులు తెలిపారు. సోమవారం హుజూర్నగర్ తహసిల్దార్ కార్యాలయంలో డివిజన్ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజావా ణిలో అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సంద ర్భంగా ఆర్డీవో శ్రీనివాసులు మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం ఈదురుగాలులు, వర్షం కారణంగా కొబ్బరి చెట్లు విరిగి, విద్యుత్ స్తంభంపై పడటంతో కరెంట్ స్థంభం విరిగి కూలిపోవడంతో ఏర్పడిన విద్యుత్ సమస్య కారణంగా తహసిల్దార్ కార్యాలయంలో గ్రీవెన్స్డ్ ను నిర్వహించినట్లు తెలిపారు. ఎప్పటిలాగే ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్లోను ఆర్డీవో కార్యాలయంలోనే నిర్వహించడం జరుగతుందని, ప్రతి సోమవారం ఉదయం 1030 గంటల నుండి మద్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజల నుండి ఆర్జీలు స్వీక రించనున్నట్లు ఆర్డీవో చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసి ల్దార్ బండ కవిత, విద్యుత్ శాఖ డిఈ వెంకటకృష్ణయ్య, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు..

కృష్ణ తండ అంగన్వాడీ సమస్యల పరిష్కారానికి చర్యలు.

మఠంపల్లి మండలంలోని కృష్ణ తండ గ్రామంలో ఉన్న 1వ అంగన్వాడీ సెంటర్‌ను గ్రామ సర్పంచ్ బాణోతు రమాదేవి శంకర్ నాయక్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో నిర్వహణ విధానం, సదుపాయాలపై సమగ్రంగా పరిశీలన చేపట్టారు. రికార్డులను తనిఖీ చేసి పిల్లలకు అందుతున్న పోషకాహారం, సేవలపై వివరాలు తెలుసుకున్నారు.
అంగన్వాడీ కేంద్రంలో ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. పిల్లల ఆరోగ్యం, పోషణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. గ్రామంలో అంగన్వాడీ సేవలు మెరుగుపడేలా అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు.
స్థానికులు కూడా తమ సమస్యలను వెల్లడించగా, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని సర్పంచ్ తెలిపారు..

*నేరేడుచర్లలో బీజేపీ శ్రేణుల సంబరాలు*

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలో భాగంగా మూడు రాష్ట్రాల్లో బిజెపి పార్టీ అధికారం సాధించిన సందర్భంగా నేరేడుచర్ల పట్టణంలో పట్టణ అధ్యక్షులు కొణతం నాగిరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన కూడలి వద్ద పార్టీ కార్యకర్తలు బాణసంచా పేల్చి,ఒకరికి ఒకరు మిఠాయిలు పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు మాట్లాడుతూ…ఐదు రాష్ట్రాల ఫలితాలు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి పెరుగుతున్న ప్రజాభిమానానికి నిదర్శనమని పేర్కొన్నారు.ప్రధాని నాయకత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు మద్దతు తెలుపుతున్నారని తెలిపారు. దేశాభివృద్ధి దిశగా తీసుకుంటున్న నిర్ణయాలు,పారదర్శక పాలన, మౌలిక సదుపాయాల విస్తరణ వంటి అంశాలపై ప్రజలు విశ్వాసం ఉంచారని అన్నారు.అలాగే రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ఈ విజయాలు రాబోయే కాలంలో మరింత బలమైన పాలనకు మార్గదర్శకంగా నిలుస్తాయని, పార్టీ మరింత ఉత్సాహంతో ప్రజాసేవలో ముందుకు సాగుతుందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి కాలం నాగయ్య,ఏమిరెడ్డి శంకర్ రెడ్ది,రాష్ట్ర నాయకులు బాల వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు తాళ్ల నరేందర్ రెడ్డి,సంకలమద్ది సత్యనారాయణ రెడ్ది,సీనియర్ నాయకులు మెట్టు శ్రీనివాసరెడ్డి, ఉరిమల్ల రామ్మూర్తి, మెట్టు మధుసూదన్ రెడ్డి, గంధం శావయ్య, కడారి ఎల్లయ్య, కాంపల్లి నారాయణరెడ్ది,
తాటికొండ పరమేశ్వర్ రెడ్డి, వెన్న సురేష్, ఉమ్మడి శ్రీనివాస్ రెడ్డి, బుస్సా విమల, చేపూరి కృష్ణవేణి, దేవిరెడ్డి నాగిరెడ్డి, కొప్పు లక్ష్మీనారాయణ, రూపావత్ వెంకటేష్, , కోటేశ్వరరావు , కాట కృష్ణారెడ్డి మరియు బిజెపి కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు..

హుజూర్ నగర్ లో బీజేపీ పార్టీ సంబరాలు…

దేశంలో ఐదు రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికలలో భాగంగా నేడు వెలువడినటువంటి ఫలితాలలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించినందుకు గాను *పట్టణ అధ్యక్షులు కొండ హరీష్ గౌడ్* ఆధ్వర్యంలో పట్టణ కార్యాలయంలో మిఠాయిలు పంచి విజయోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా హుజూర్ నగర్ *బిజెపి పట్టణ అధ్యక్షులు కొండ హరీష్ గౌడ్..
మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఈరోజు వెలువడినటువంటి ఎన్నికల ఫలితాలలో భారతీయ జనతా పార్టీ మూడు రాష్ట్రాలలో భారీ మెజారిటీ తోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, మిగిలిన రెండు రాష్ట్రాలలో ఓటింగ్ పర్సంటేజ్ మరియు సీట్లను పెంచుకోవడం జరిగిందని తెలిపారు. వీటిలో అస్సాం, పుదుచ్చేరిలో మళ్లీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడంతోపాటు పశ్చిమబెంగాల్ లో మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం చాలా హర్షించదగ్గ విషయమని, ఈ ఫలితాలు ప్రజలలో ప్రియతమ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి మరియు అమిత్ షా గారికి ఉన్నటువంటి ఆదరణకు ఉదాహరణ అని తెలిపారు. ఇదే ఉత్సాహంతోటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాబోయే రోజులలో తెలంగాణలో కూడా బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా పయనిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పిడమర్తి చంద్రయ్య, సోమగాని ప్రదీప్ గౌడ్, గుండా గోపి, సతి బల్వంత్ సింగ్, రాళ్లబండి రామారావు మరియు తదితర బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు..

మీ ప్రాంతాల్లో వార్త ఏదైనా మాకు అందించండి…
మా వాట్సాప్ నెంబర్…+91 91330 57959.