హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ నిరసనలు…!

*సూర్యాపేట జిల్లా….*
బిఆర్ఎస్ పార్టీ పిలుపుమేరకు,, నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి ఆదేశాలమేరకు,,
హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ నిరసనలు…

మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ని అసెంబ్లీ నుండి సస్పెన్షన్ చేయడాని నిరసిస్తూ…హుజూర్ నగర్ అడ్డ రోడ్ లొ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నాకు దిగిన బిఆర్ఎస్ శ్రేణులు…
నియోజకవర్గంలోని
గరిడేపల్లి,, మఠంపల్లి మండలాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమాలు నిర్వహించారు..

వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ డిమాండ్ చేశారు..

*ఈ సందర్భంగా కొప్పుల సైదిరెడ్డి,, జక్కుల నాగేశ్వరరావు బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ….*
.
మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ పరువు పోతుందనే ఆలోచనతో… జగదీష్ రెడ్డిని కట్టడి చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం ఓ కుటిల బుద్ధిని బయటపెట్టిందని ఆరోపించారు..

కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసినా మేలు ఏమిటో వివరించలేక.. ప్రశ్నించే వారిని సస్పెండ్ చేయడం అప్రజాస్వామీకం అని అన్నారు..

స్పీకర్ పట్ల అనిచిత వ్యాఖ్యలు చేయకుండానే దళితుడిపై అనుచిత వ్యాఖ్యలు అంటూ కాంగ్రెస్ పార్టీ అసత్యాలు ప్రచారం చేస్తుందని అన్నారు..

సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ దళిత మహిళా చైర్మన్ ని దింపే ప్రయత్నం చేస్తే,, brs అధికారంలో లేకున్నా కానీ దళిత మహిళా చైర్మన్ పదవిని కాపాడిన ఘనత కూడా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కే దక్కుతుందని అన్నారు…… ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని.. ఆ విషయం సభలొ ప్రశ్నిస్తే ప్రజలందరికీ తెలుస్తుందని భయంతో ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని.. ఆరోపించారు…