శాసనసభ సమావేశాల నుండి సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడం అనైతికం -మలిదశ తెలంగాణ ఉద్యమకారులు.
హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో ఈరోజు తెలంగాణ మలిదశ ఉద్యమకారులు, బిఆర్ఎస్ ముఖ్య నాయకుల ఈ సమావేశంలో పాల్గొన్నారు. పలువురు తెలంగాణ మలిదశ ఉద్యమకారులు మాట్లాడుతూ తెలంగాణ శాసనసభ సమావేశాల నుండి జగదీష్ జగదీశ్ రెడ్డి ని బడ్జెట్ సమావేశాల నుండి సస్పెండ్ చేయడం అనైతికమైన చర్యని ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో విఫలమైందని ప్రజలకు వివరిస్తున్నారనే భయంతోనే.. ఇలా సస్పెండ్ చేయడం అనైతికమైన చర్య అని అదేవిధంగా శాసనసభాపతి హక్కుల గురించి ప్రశ్నించినందుకు సస్పెండ్ చేస్తారా అని శాసనసభాపతి అనేవారు శాసనసభ్యులను సక్రమమైన మార్గంలో నడిపించే పెద్దమనిషి పాత్రను పోషించు వారు మాత్రమే అని ప్రశ్నిస్తే తప్ప అని ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవరినైనా ప్రశ్నించే హక్కును రాజ్యాంగం కల్పించిందని* *అమలు కానీ హామీలను ఇచ్చి చతికిల పడిన ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలని అదేవిధంగా *జగదీశ్ రెడ్డి మీద విధించినటువంటి సస్పెండ్ ను వెంటనే ఎత్తివేయాలని*డిమాండ్ చేశారు…
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ ఉద్యమ నాయకులు పచ్చిపాల ఉపేందర్ *చిలకరాజు అజయ్ మాజీ టౌన్ పార్టీ అధ్యక్షులు దొడ్డ నరసింహారావు. *మలిదశ తెలంగాణ ఉద్యమకారులు మరియు మాజీ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు న్యాయవాది నగేష్ రాథోడ్ *నియోజకవర్గ జాగృతి కన్వీనర్ కొనగంటి సత్యనారాయణ రెడ్డి, కోలా శ్రీనివాస్ గౌడ్, ముల్కపల్లి రాంబాబు, గొబ్బి రాము, మహేష్, కొర్ర వీరయ్య, సైదులు, ఎర్రయ్య, శ్రీను, నాగరాజు,రాము, బ్రహ్మం, ములకపల్లి శీను, జోగు వెంకన్న, కొటారి లింగయ్య* , తదితరులు పాల్గొన్నారు