తుఫాన్ బాధిత రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలి… కొప్పుల సైదిరెడ్డి..

సూర్యాపేట జిల్లా.. హుజూర్నగర్ మండలంలో తుఫాన్ దాటికి తీవ్రంగా నష్టపోయిన పొలాలను పరిశీలించి, రైతులను ఓదార్చిన మాజీ జెడ్పిటిసి, బిఆర్ఎస్ నాయకులు కొప్పుల సైదిరెడ్డి…

ఈ సందర్భంగా కొప్పుల సైదిరెడ్డి మాట్లాడుతూ..

ఆరు గాళాలు కష్టపడి పండించిన పంట నేలమట్టం అయిందని,, కనీసం రైతులు వద్దకు వచ్చి అధికారులు పంట నష్టం అంచనా కూడా వేయకపోవడం పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు…

మోంథా తుఫాన్ ప్రభావం హుజూర్ నగర్ నియోజకవర్గం పై తీవ్ర ప్రభావం చూపించిందని భారీ వర్షాలకు పొట్ట దశలో ఉన్న పంటపొలాలు,, నీటిపాలైందని… అమరవరం, శ్రీనివాసపురం గ్రామాల్లో రైతులతో మాట్లాడుతుంటే ఎంతగానో ఆవేదన ఎదురవుతుందని అన్నారు… వారి బాధల్ని మాటల్లో చెప్పలేని విధంగా తుఫాన్ ప్రభావం చూపిందని అన్నారు….
రైతుల పట్ల అవగాహన లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇప్పటివరకు అధికారులని నష్టపోయిన రైతుల వద్దకు పంపించి ధైర్యం చెప్పడంలో విఫలమయ్యారని ఆరోపించారు… తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం 40 వేల రూపాయలు ఎకరాకు చెల్లించి, తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని అన్నారు.. గతంలో సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు నష్టపోయిన రైతులకు 24 గంటల్లోనే వారి ఎకౌంట్లోకి డబ్బులు జమ చేశారని అన్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బీమా రైతు బంధు పథకాలకు స్వస్తి పలికారని అన్నారు.. త్వరితన రైతులకి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.. లేదంటే బిఆర్ఎస్ పార్టీ పక్షాన రైతులతో కలిసి నిరసన కార్యక్రమాలు తెలుపుతమని అన్నారు..

ఈ కార్యక్రమంలో మాజీ పిఎసిఎస్ చైర్మన్ కామిశెట్టి వెంకటేశ్వర్లు, సామల మట్టా రెడ్డి, పుస్తెల లింగారెడ్డి ఉస్తేల గురువారెడ్డి కట్ట సతీష్ ఉస్తేల సీతారాంరెడ్డి, మిర్యాల శ్రీనివాస్, కొప్పుల శ్రీనివాస్ రెడ్డి, సింగతల సురేందర్ రెడ్డి, కొప్పుల రాంరెడ్డి, సింగతల సురేందర్ రెడ్డి, ఉస్టెల అంకిరెడ్డి, అమరబోయిన మట్టయ్య యాదవ్, గుజ్జుల కోటిరెడ్డి, ఉస్తేల సంతోష్ రెడ్డి, బల్పూరి సాంబిరెడ్డి, కందుల అంజిరెడ్డి, గుజ్జుల శ్రీనివాస్ రెడ్డి, సోమయ్య యాదవ్, గుండెబోయిన శ్రీనివాస్, దూబ అశోక్, షేక్ సలీం, మల్రెడ్డి వెంకటరెడ్డి, కొప్పుల చిన్న రాంరెడ్డి, అన్నెం సీతారాంరెడ్డి తదితరులు ఉన్నారు..