అర్హులైన్ జర్నలిస్టులకు ఇండ్లు ఇండ్ల స్థలాలు కేటాయించాలి..

అర్హులైన్ జర్నలిస్టులకు ఇండ్లు ఇండ్ల స్థలాలు కేటాయించాలి
— గృహనిర్మాణ పథకం ద్వారా రూ.5 లక్షలు మంజూరు చేయాలి

*హుజూర్‌నగర్…*

హుజూర్‌నగర్ పట్టణంలోని ఫణిగిరి రామస్వామి గుట్టవద్ద గత ప్రభుత్వ హాయంలో జర్నలిస్టులకు కేటాయించిన ఇండ్ల స్థలాలకు పొజిషన్ ఇచ్చి గృహనిర్మాణ పథకం ద్వారా రూ 5 లక్షల నిధుల కేటాయింపు చేయాలని కోరుతూ తహసిల్దార్ బండా కవిత,, మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ కమిషనర్ కే సతీష్ లకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఎటువంటి జీత భత్యాలు లేకుండా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులకు ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. ఈ విషయమై రాష్ట్ర నీటి పారుదల ఫౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని కలుస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానికి మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.