కేసీఆర్ చనిపోవాలని కోరుకుంటున్నట్లు ఏదో ఫ్లోలో అన్నాను.- కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్..

కేసీఆర్ చనిపోవాలని కోరుకుంటున్నట్లు ఏదో ఫ్లోలో అన్నాను.- కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్..

కేసీఆర్ ఇంటి ద‌గ్గ‌ర చావు డ‌ప్పు కొడుతామ‌ని, తాము ఆయ‌న చావును కోరుకుంటున్నామ‌ని నోటి దుర‌ద ప్ర‌ద‌ర్శించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్ల‌ప‌ల్లి శంక‌ర్.. తాజా విచిత్ర‌మైన వివ‌ర‌ణ ఇచ్చారు. తాను ఫ్లోలో అలా మాట్లాడాన‌ని, తాము కేసీఆర్ చావును కోరుకోవ‌డం లేద‌ని మాట‌మార్చారు. కేసీఆర్ అసెంబ్లీకి వ‌స్తే తాము ఆయ‌న‌ను గౌర‌విస్తామ‌ని చిలుక‌ప‌లుకులు ప‌లికారు. కానీ అంత‌మాట మాట్లాడినందుకు క‌నీసం క్ష‌మాప‌ణ కూడా కోర‌లేదు.