స్నేహితుడి కుమార్తె ప్రతిభకు,, చిరు సహాయం…!

*స్నేహితుడి కుమార్తె ప్రతిభకు,, చిరు సహాయం…*……

పదో తరగతి ఫలితాల్లో  ప్రభుత్వ పాఠశాలల్లో చదివి సూర్యాపేట జిల్లా లోనే మొదటి ర్యాంకు సాధించడమే కాకుండా ప్రతిష్టాత్మక IIT బాసరలో సీటు సాధించిన మనతో పాటు చదివిన ఐల. నాగరాజు కూతురు మౌనికాకు  , ఎన్ఎస్పి క్యాంప్ పాఠశాలలో ఆరో తరగతి నుంచి పదో తరగతి  
(1994-99)చదివిన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఈరోజు జరిగినది..

ఐల నాగరాజు కూతురు మౌనిక స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివి (2024-25 ఫలితాల్లో)  571 మార్కులు..సూర్యాపేట జిల్లాలోనే మొదటి ర్యాంకు సాధించిన దానితో పాటు ప్రతిష్టాత్మక ఐఐటి బాసరలో ఇంటర్ మొదటి సంవత్సరాలు సీటు సాధించినది..

మౌనిక ప్రతిభను గుర్తించిన వాళ్ల నాన్నగారి మిత్రులంతా కలిసి 10, 000 ( అక్షరాల పదివేల రూపాయలు )  ప్రోత్సాహక బహుమతిని అందజేశారు..

ప్రతి సంవత్సరం దసరా సెలవులలో కలుసుకోవాలనే నిర్ణయం మేరకు మిత్రులందరు కలుసుకున్నారు…

2007 గెట్ టుగెదర్ పార్టీ జరిపి గురువులను సన్మానించిన తర్వాత  ప్రతి సంవత్సరం దసరా సెలవుల లో  అప్పుడు చదువుకున్న మిత్రులంత  కలుసుకోవాలని నిర్ణయించడం జరిగింది….

ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మిత్రులందరు కలుసుకొని ఆటపాటలతో సరదాగా ఒకరోజు గడిపారు..

ఇదే కాకుండా గతంలో కూడా వారితోపాటు చదువుకున్న స్నేహితులు అకాల మరణం పొందినప్పుడు కూడా మిత్రబృందం మొత్తం కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించి మేము సైతం అంటూ వారి కుటుంబానికి అండగా నిలిచారు…..

వీరు చేసిన ఈ కార్యక్రమాలు చూసి పలువురు హర్షం వ్యక్తం చేశారు…

ప్రభుత్వ పాఠశాలలో చదివి ప్రతిభ కనబరిచినందుకుగాను. మౌనికకు ప్రోత్సహక బహుమతిని  అందజేసిన వారిలో సులువ శ్రీను , త్రిపురం రమేష్ రెడ్డి,
రామి శెట్టి శ్రీనివాస్, ఏషాల రవికుమార్,
బింగి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు..