హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యాటనతో ముందస్తు అరెస్టులు..

సూర్యాపేట జిల్లా… హుజూర్ నగర్ లో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా, నియోజకవర్గంలోని పాలకీడు, నేరేడుచర్ల, మఠంపల్లి, మండలాలతో పాటు పలు మండలాల్లో ముందస్తు బిఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు బీజేపీ ,cpm పార్టీల నాయకుల్ని తెల్లవారుజామునే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించిన పోలీసులు…….. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఎటువంటి నిరసనలకు పిలుపులు ఇవ్వకున్నా,. ఉగాది పండుగ పర్వదినాన ఈ అక్రమ అరెస్టులు ఏమిటని ప్రశ్నిస్తున్నారు…. నిజంగా నిజమైన పరిపాలన రేవంత్ రెడ్డి అందిస్తే ప్రజలే ఘన స్వాగతం పలికి, పూలు చల్లుతారని అన్నారు… అలాకాకుండా ప్రజా పరిపాలన అందించలేదు అని ఆలోచన వస్తేనే ఇలా ముందస్తు అరెస్టులు చేస్తారని అన్నారు… ఆరు గ్యారెంటీ లతోపాటు ఏడో గ్యారెంటీ ని కూడా అమలు చేస్తున్నారని ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోని పథకమని అన్నారు… ఈ అక్రమ అరెస్టులు ఇప్పటికైనా ఆగకపోతే రానున్న రోజుల్లో ప్రభుత్వంపై పోరాటం తప్పదని హెచ్చరించారు..