*🔹తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం*
_• నేడు గవర్నర్ను కలవనున్న సీఎం రేవంత్.._
_• మ.12 గంటలకు రాజ్భవన్ వెళ్లనున్న సీఎం రేవంత్._
_• మంత్రివర్గ విస్తరణపై గవర్నర్తో చర్చించే అవకాశం._
_*• ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ ఉండే చాన్స్..*_
_• కేబినెట్లో నలుగురికి చోటు కల్పించే అవకాశం._
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress) అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తోంది. అయితే ఇప్పటివరకూ మంత్రివర్గం మాత్రం పూర్తిగా ఏర్పడలేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా (CM Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో 11 మందిని తన కేబినెట్ (Revanth Cabinet) లోకి తీసుకున్నారు. అసెంబ్లీ సీట్లను బట్టి 18 మందిని మంత్రులుగా నియమించుకునే అవకాశం ఉంది. దీని ప్రకారం ఆరు స్థానాలు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. వీటిని భర్తీ చేయాలనే డిమాండ్ ఎంతోకాలంగా వినిపిస్తోంది. అయితే అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఇప్పటివరకూ దాని జోలికి వెళ్లలేదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణకు (Revanth Reddy Cabinet Expansion) గ్రీన్ సిగ్నల్ లభించినట్లు సమాచారం..