సూర్యాపేట జిల్లా…..
హుజూర్నగర్ మండలంలో శ్రీ ఆదివరాహ లక్ష్మీ నరసింహ వేణుగోపాలస్వామి ఆలయంలో స్వేచ్ఛగా సంచరిస్తున్న నక్షత్ర తాబేలు…చాలా అరుదుగా ఇలాంటి నక్షత్ర తాబేలు కనిపిస్తూ ఉంటాయని,, అవి మనుషులని చూస్తే కొంత దూరం వెళ్లే ప్రయత్నం చేస్తాయని అందరికీ తెలుసు.. కానీ ఇక్కడ దేవాలయంలో మాత్రం భక్తులతో పాటు కలిసి పోవడం.. వాటికి ప్రత్యేక పూజలు నిర్వహించటం చెప్పుకోదగ్గ విశేషం అని భక్తులు అంటున్నారు…
అర్చకులు తెలిపిన వివరాల ప్రకారం.. నిత్యం పూజలు అందుకునే శ్రీ ఆదివరాహ లక్ష్మీనరసింహ వేణుగోపాల స్వామి ఆలయంలో కార్తీక మాసంలో భక్తులు భారీగా పాల్గొని పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.. అంతేకాకుండా నక్షత్ర తాబేలు కి ఇక్కడ ప్రత్యేకంగా పూజలు నిర్వహించటం విశేషమని అన్నారు.. కార్తీకమాసంలో నేడు ఉసిరి చెట్టు వద్ద వ్రతాలు చేయడం విశేషమని నేడు మహిళలు భారీగా పాల్గొని ఉసిరి చెట్టుకి పూజలు చేయడం జరుగుతుందని తెలిపారు..