నకిలీ సరుకులు కలకలం..!
హుజూర్నగర్లో ఆటో ద్వారా నకిలీ బ్రాండెడ్ వస్తువుల విక్రయం వెలుగులోకి.
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో నకిలీ బ్రాండెడ్ సరుకుల వ్యవహారం కలకలం రేపింది. అసలూ–నకిలీ తేడా తెలియనివిధంగా స్టిక్కరింగ్, ప్యాకింగ్ చేయడంతో వినియోగదారులు మోసపోతున్న పరిస్థితి నెలకొంది.
“కనిపెడితే కనికట్టు.. కనిపెట్టకపోతే ఆరోగ్యమే కట్టు” అన్నట్లు నకిలీ సరుకుల వల్ల ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతున్నదనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ప్రతిదీ కల్తిమయమవుతున్న తరుణంలో, వాటిని అరికట్టడంలో అధికారులు విఫలమవుతున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
ఆటోలో నకిలీ సరుకులు – వర్తకుల్లో కలవరం
స్థానిక వర్తక సంఘం సభ్యుల సమాచారం మేరకు, హుజూర్నగర్ పట్టణంలో ఎక్కడినుంచో ఆటోలో నకిలీ బ్రాండెడ్ స్టిక్కర్లతో నాసిరకం సరుకులు విక్రయిస్తున్నారని తెలిసి పరిశీలించారు. బ్రాండెడ్ సరుకులు అత్యంత తక్కువ ధరకే విక్రయిస్తున్నారని గమనించిన వ్యాపారులు వాటిని తనిఖీ చేయగా, బయట ప్యాకింగ్ మాత్రమే బ్రాండెడ్గా ఉండగా లోపల సరుకులు పూర్తిగా నాణ్యత లేనివిగా ఉన్నట్లు గుర్తించారు.
వెంటనే పోలీస్ అధికారులకు సమాచారం అందించినట్లు వారు తెలిపారు.
గ్రామీణ ప్రాంతాలే వీరి టార్గెట్.!
గ్రామీణ ప్రాంతాల్లో అసలకి నకిలీకి తేడా తెలవకుండా ఉండడంతో వాటిని విక్రయిస్తూ తిరుగుతూ ఉంటారు.. అక్కడి ప్రజలు కూడా కొంత కంపెనీ పేరు మాత్రమే చూస్తారు కాబట్టి దొరకటం కొంత కష్టం.. పైగా బయట కంటే రూపాయి తక్కువ వస్తుంది పట్టణాలు వెళ్లే అవసరం కూడా ఉండదు కాబట్టి అక్కడే ఎక్కువగా కొనుగోలు చేయడం జరుగుతుందన్నట్లుగా సమాచారం..
నాణ్యతలో భారీ లోపాలు.
వివరాల ప్రకారం, ఒక ఒరిజినల్ పారాచూట్ ఆయిల్ బాటిల్ తయారీ, ప్యాకింగ్ ఖర్చు కలిపిన ధర కంటే సగం ధరకే ఈ నకిలీ సరుకులు విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. కంపెనీ ప్రతినిధులకు వివరాలు పంపించగా, ఒరిజినల్ పారాచూట్ బాటిల్ సీలింగ్ మిషన్ విలువ సుమారు రెండు కోట్ల రూపాయలు ఉంటుందని, అసలైన బాటిల్ క్యాప్ తీయడం కూడా చాలా కష్టమని వారు తెలిపారు.. అంతేకాకుండా నిత్యం ఎక్కువగా టీ తాగే వారికి ఇలాంటి కల్తీ టీ తాగడం వల్ల ఆరోగ్యానికి సమస్య కూడా ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.
కానీ నకిలీ బాటిళ్లలో మూత తీయగానే విరిగిపోవడం, ఆయిల్ నీళ్లలా ఉండటం, సబ్బులు పిండిలా ఉండటం, ఆల్ అవుట్ లిక్విడ్ నాసిరకంగా ఉండటం వంటి లోపాలు బయటపడ్డాయి. లైజాల్, కంఫర్ట్ వంటి ఇతర గృహోపయోగ వస్తువులు కూడా పూర్తిగా నాణ్యత లేనివిగా ఉన్నట్లు వర్తకులు పేర్కొన్నారు..
కొంతమంది మార్వాడి షాపుల్లో కూడా నకిలీ బ్రాండెడ్ పేరుతో నకిలీవి కూడా అమ్ముతున్నారని వారిపై కూడా కొంత ఎంక్వైరీ చేయాలని స్థానిక వ్యాపారస్తులు డిమాండ్ చేస్తున్నారు.
ఆరోగ్యానికి ముప్పు.
ఈ నకిలీ ఉత్పత్తులను ఉపయోగించిన వారికి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వర్తక సంఘం హెచ్చరించింది. కేవలం ధర తక్కువగా ఉందని నాసురకం, నకిలీ సరుకులు కొనుగోలు చేసి ఇబ్బందులు పడవద్దని ప్రజలకు సూచించింది. నాణ్యమైన, ధృవీకరించిన ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేసింది.
హుజూర్నగర్ పోలీస్ స్టేషన్ లో ఆటో..
సోమవారం రాత్రి దొరికిన ఆటోని పోలీసులు పోలీస్ స్టేషన్ కి తరలించగా నేడు జిల్లా నుండి జీఎస్టీ అధికారులు వచ్చి సరుకు వ్యయం ఎంత అనేదానిపై అంచనా వేయడం జరిగింది అంతేకాకుండా. ఆ శాంపిలు సేకరించి సంబంధిత శాఖలకు పంపించడం జరుగుతుందని తెలిపారు..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959