*ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలను విజయవంతం చెయ్యండి..మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

R9TELUGUNEWS.COM.
సంవత్సరం పూర్తి చేసుకుని విజయవంతంగా పూర్తి చేసి రెండో సంవత్సరంలోకి అడుగుపెడుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు… రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు హుజుర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని కౌండిన్య ఫంక్షన్ హాల్ లో ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విజయోత్సవాల కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసేందుకు హుజూర్ నగర్ వైస్ చైర్మన్ కోతి సంపత్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జున్ సమన్వయ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు…
మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ను ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్..

R9TELUGUNEWS.COM.
హుజూర్నగర్ లోని మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ ఆకస్మికంగా పరిశీలించారు.శనివారం రాత్రి 7:00 లకు ఆకస్మంగా పరిశీలించారు. విద్యార్థినులను హస్టల్ నిర్హణ , సిబ్బంది పనితీరు, భోధన, గురించి విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ నందు భోజన పరివేక్ణణ కొరకై విద్యార్థినులచే మిస్ కమిటీ ఏర్పాటు చేయాలని, ఈ కమిటీ వసతి గృహమునకు తీసుకువచ్చే నిత్యవసర సరుకులు, కూరగాయలు, పండ్లు ,కమిటీ పరిశీలించి రిజిస్టర్లలో నమోదు చేసిన తర్వాతే అల్పాహారం, భోజనాలు తయారు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు, వసతి గృహ ఇన్చార్జిలు తప్పక వసతి గృహాలను పరిశీలించి నివేదిక అందజేయాలని కలెక్టర్ తెలిపారు. అనంతరం విద్యార్థులతో భోజనం చేస్తు విద్యార్థులతో మాట్లాడారు హాస్టల్ నిర్వహణ విధానాన్ని బోధన విధానాన్ని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు జిల్లా కలెక్టర్ పిల్లలు ఆరోగ్యంగా ఉండి మంచిగా చదువుకోవాలని ప్రభుత్వం మీ చదువుల కొరకు అన్ని ఏర్పాట్లు చేసిందని పరీక్షలలో 100% ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ ఈ సందర్భంగా కోరారు. ఇక నుండి ఆన్ని ఆకస్మిక తనిఖీలు ఉంటాయని అన్ని వసతి గ్రుహలు,రెసిడెన్సీయల్ స్కూల్స్, కెజిబివిలు, పరిశుభ్రత గా ఉండాలని,మేను ప్రకారం అహరం అందించాలని, గుణాత్మక విద్యాబోధన చెప్పాలన్నారు..
*తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్థిక సామాజిక సర్వే విజయవంత చేయాలి..అరుణ్ కుమార్ దేశ్ ముఖ్ *

R9TELUGUNEWS.COM.
*తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్థిక సామాజిక సర్వే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని హుజుర్నగర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అరుణ్ కుమార్ దేశ్ ముఖ్ పిలుపునిచ్చారు. శుక్రవారం హుజుర్నగర్ మండలం బూరుగడ్డ గ్రామంలో సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమంలో పాల్గొని . ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడం కోసమే సమగ్ర కుటుంబ సర్వే చేపట్టిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం లో పంచాయతీ ఇంచార్జ్ సెక్రటరీ గిరజా కుమారి యరగాని నాగరాజు పాల్గొన్నారు…
గడ్డి ట్రాక్టర్ దగ్ధం..

R9TELUGUNEWS.COM.
చింతలపాలెం మండల కేంద్రంలో గడ్డితో వెళ్తున్న ట్రాక్టర్ కు విద్యుత్ వైర్లు తాకడంతో నిప్పురవ్వలు ట్రక్కు పై ఉన్న గడ్డి పై పడటంతో ఒక్కసారిగా చెలరేగిన మంటలు,, ఊరి మధ్యలో ఉండడంతో ఈ విషయాన్ని గ్రహించిన ట్రాక్టర్ డ్రైవర్ చాక చాక్యంగా వ్యవహరించి ఎవరూ లేని ఖాళీ స్థలానికి ట్రాక్టర్ టక్కును తీసుకెళ్లి వదిలేయడంతో వరిగడ్డి ట్రక్కు పూర్తిగా దగ్ధమయ్యాయి.. ట్రాక్టర్ వేపలసింగారం నుంచి చింతలపాలెం మండలం కు చెందిన రైతుకు గడ్డిని ట్రాక్టరుపై వేసుకుని గ్రామంలోకి వస్తున్నట్లు తెలిపారు…గ్రామలోకి రాగానే విద్యుత్ వైర్లు ట్రాక్టర్ ట్రక్కు పై ఉన్న గడ్డికి తాకడంతో మంటలు వ్యాపించి ట్రాక్టరు ట్రక్కుతో సహా వరిగడ్డి దగ్ధమైంది అయిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు…
ఆస్తి తగాదాలో తమ్ముడిని చంపిన అన్న...
R9TELUGUNEWS.COM
*గరిడేపల్లి మండలం రంగపురం లో హత్య*…

R9TELUGUNEWS.COM.
తరచుగా అన్నదమ్ములు మధ్య ఆస్తి కోసం తగాదాలు జరుగుతూ ఉండేయని పలువురు స్థానికులు తెలిపారు ఇటీవల ఇంటిస్థలం, వ్యవసాయ భూమి గురించి అన్నదమ్ములు, తండ్రి మాట్లాడుతుండగా మాట మాట పెరిగి, తమ్ముడైన నకిరేకంటి సంజయ్ ను అన్న నకిరేకంటి అంజి రోకలి బండతో తలపై గట్టిగా కొట్టడంతో సంజయ్ అక్కడికక్కడే మృతి.. చెందడం జరిగింది. ఈ ఘటనపై.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..సంజీవ్ డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం హుజూర్ నగర్ ఏరియా హాస్పిటల్ కి తరలించడం జరిగింది…
ఎమ్మార్పీఎస్ ఆత్మీయ సంఘాల కార్యక్రమానికి తరలిన ఎమ్మార్పీఎస్ నాయకులు..

R9TELUGUNEWS.COM
నల్లగొండలో జరిగే ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి హుజూర్ నగర్ నియోజవర్గం నుండి పలువురు నాయకులు బయలుదేరడం జరిగింది…పలువురు ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి దళిత బంధు ఇవ్వకుండా, దళితుల్లో మోసం చేశాడంట ఆరోపించారు..
మాదిగల ఏదైనా కోసం ఎంతగానో కృషి చేసే మందకృష్ణ మాదిగ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరుకావాలని పిలుపునిచ్చారు..
ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి. ఎంజెఎఫ్ నాయకులు.
హుజూర్నగర్ నియోజకవర్గ ఇన్చార్జి బచ్చలకూరి ప్రసాద్ మాదిగ. హుజూర్నగర్ మండల అధ్యక్షులు గుండెపంగు బాబు మాదిగ. జిల్లా ఉపాధ్యక్షులు ఒగ్గు విశాఖ మాదిగ. చింతలపాలెం మండల అధ్యక్షులు కనితి ప్రశాంత్ మాదిగ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగిందని తెలిపారు..
*ప్రతి ఇంటికి ప్రజా పాలన పథకాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు..ప్రజా పాలన పథకాలపై ఇంటింటికి కళా జాత ప్రదర్శన.

R9TELUGUNEWS.COM.
హుజూర్ నగర్ మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని గోపాల పురం, బూరుగడ్డ గ్రామాలలో ప్రతి ఇంటికి ప్రజా పాలన పథకాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలంగాణ సాంస్కృతిక సారధి జిల్లా టీమ్ లీడర్ వేముల శ్రవణ్ అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ఏడాది పాలన పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ మరియు సమాచార పౌర సంబంధాల అధికారి ఆదేశాల ప్రకారం జిల్లా లోని ప్రతి గ్రామంలో కళా జాత ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన 6 గ్యారంటీలలో ఒకటైన ఉచిత బస్ పథకంలో భాగంగా ఫ్రీగా బస్ ప్రయాణం చేసే ప్రతి మహిళ కళ్ళలో ఆనందం కనబడుతుందని అన్నారు ప్రతి మహిళకు రూ. 500 సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ను అందించడం జరుగుతుందని అర్హులైన పేదలకు ఐదు లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేయడం జరుగుతుందని రైతు భరోసా పేరుతో రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరుగుతుందని వివరించారు గృహ జ్యోతి పథకంతో ప్రతి ఇంటికి 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు స్కిల్ యూనివర్సిటితో రెసిడెన్షియల్ పాఠశాలలు అనుసంధానం చేసి నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు గిరిజన శిక్షణ ఉపాధి కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు ప్రతి ఒక్కరు ఈ పథకాలు అందుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారధి కళా కారులు గంట భిక్షపతి, పల్లెల లక్ష్మణ్, కుందమల్ల నాగలక్ష్మి, ఒంటెపాక ప్రియంక,నెమ్మాది స్రవంతి, మేడి ప్రియదర్శిని,మేడి ఇందిర లతో పాటు ఆయా గ్రామాల కార్యదర్శులు గిరిజ,ఇందిర తదితరులు పాల్గొన్నారు..
ఉచిత డెంటల్ చెకప్…!

సిరి డెంటల్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఏండిఆర్ హై స్కూల్ లో ఉచిత డెంటల్ చెకప్.
ఈ రోజుల్లో మనం తినే ఆహారం వలన మనకు అనేక జబ్బుల కలుగుతున్నాయి. అందులో ముఖ్యంగా పళ్ల సమస్యలు ఒకటి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ డాక్టర్ K. Malleshwari గారు MDR స్కూల్ నందు ఉచిత క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మల్లేశ్వరి గారు ఎంతో శ్రద్దతో పిల్లలని పరిశీలించి వారికి ఉన్న ఆహారపు అలవాట్ల గురించి, బ్రష్ చేయడం గురించి పళ్ళు పుచ్చిపోకుండా, పల్లకి ఏ హాని కలగకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి వివరించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సిరి డెంటల్ హాస్పిటల్ మేనజింగ్ డైరెక్టర్ Sana, Dr. Malleshwari తో పాటు PA Mounika, వారి తోడ్పాటుని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారుగా 450 మంది బాలబాలికలు పాల్గొని డాక్టర్ గారి సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో MDR స్కూల్ కరెస్పాండెంట్ మేరెడ్డి దామోదర్ రెడ్డి , ప్రిన్సిపల్ నలబోలు భూపాల్ రెడ్డి, AO పింగళి నర్సిరెడ్డి, ఉపాద్యాయునిఉపాద్యాయులు.. పాల్గోన్నారు..