హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం…

హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. మంగళవారం సాయంత్రం నగరంలోని ఖైరతాబాద్, లక్డీకపూల్, నాంపల్లి, సంతోష్ నగర్, చంపాపేట్, సైదాబాద్, సరూర్ నగర్, శామీర్ పేట్, నిజాంపేట, బాచుపల్లి, కూకట్ పల్లి, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, వివేకానంద నగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. భారీ వర్షం కారణంగా ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల వరద నీరు భారీగా రోడ్లపైకి చేరింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సరిగ్గా ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలు ముగిసే వేళ వర్షం కురియడంతో వాహనదారులు, ప్రయాణికులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.