హైదరాబాద్ అత్తాపూర్‌లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్..

హైదరాబాద్ అత్తాపూర్‌లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్..

థార్ కారులో యువతిని బలవంతంగా ఎక్కించుకొని కిడ్నాప్ చేసిన నలుగురు యువకులు

వారి నుంచి తప్పించుకునేందుకు జాయ్ ఆసుపత్రిలోకి పరిగెత్తిన యువతి

యువతిని బెదిరించి కారులో తీసుకెళ్లిన యువకులు

పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు

థార్ కారును ఛేజ్ చేసే ప్రయత్నం చేసిన పోలీసులు

అత్తాపూర్ నుంచి ఆరంఘర్ చౌరస్తా వరకు ఛేజ్ చేసిన పోలీసులు

పోలీసుల కళ్లు కప్పి పారిపోయిన కిడ్నాపర్స్

తెల్లవారుజామున 3గంటల వరకు కొనసాగిన పోలీసులు దర్యాప్తు

సీసీటివి ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు

కారు వెనకాలే మరో బైక్ కూడా ఫాలో అయినట్టు గుర్తింపు…

గ్రేటర్ హైదరాబాద్ శివారు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి యువతి కిడ్నాప్ కలకలం. థార్ కారులో యువతిని బలవంతంగా ఎక్కించుకోని తీసుకోని వెళ్లిన నలుగురు యువకులు. డయల్100 నెంబర్ కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించిన స్ధానికులు. థార్ కారును చేజ్ చేసే ప్రయత్నం చేసిన పోలీసులు. అత్తాపూర్ నుండి ఆరాంఘర్ చౌరస్తా వరకు చేజ్ చేసిన పోలీసులు. పోలీసుల కళ్లు కప్పి పారిపోయన కిడ్నాపర్స్.

నెంబర్ ప్లేట్ లేని కారు కావడంతో వివరాలు స్వేకరించడం లో పోలీసుల విఫలం. PVNR ఎక్స్ ప్రేస్ వే 143 పిల్లర్ నెంబర్ వద్ద సీసి టివి ఫూటేజ్ ను పరిశీలించిన పోలీసులు. నెంబర్ లేని కారు కావడంతో వివరాలు సేకరించడం కష్టతరంగా మారిన పరిస్థితి. యువతి కిడ్నాప్ కు గురైందా? లేక వేరే కారణం ఎమైనా ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్న అత్తాపూర్ పోలీసులు. కిడ్నాప్ కు గురైన యువతి ఎవరన్నది తెలియని పరిస్థితి యువతి కిడ్నాప్ కు గురైనట్లు గా ఇప్పటి వరకు పోలీసులకు అందని ఫిర్యాదు.