హైదరాబాద్ : మియాపూర్ లో తీవ్ర విషాదం ఐదుగురు మృతి…

హైదరాబాద్ : మియాపూర్ లో ఐదుగురు మృతి.

అనుమానాస్పద స్థితిలో ఐదు మృతదేహాలు.

ఒకే కుటుంబానికి చెందినవారిగా స్థానికుల వెల్లడి.

ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్న పోలీసులు.

మృతుల్లో అత్త, మామ, భార్య, రెండేళ్ల చిన్నారి.

ఘటనాస్థలిలో విచారిస్తున్న పోలీసులు.

హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా స్థానికులు వెల్లడించారు. స్థానికుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారంతా ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. మృతుల్లో అత్త, మామ, భార్య, భర్త, రెండేళ్ల చిన్నారి ఉన్నారు. ఈ మేరకు పోలీసులు విచారణ చేపట్టారు..

మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని స్థానికులు మాట. ఎవరైనా విషం కలిపారా? సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారా? అనేదానిపై రకరకాలుగా కథనాలు వస్తున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతులంతా కర్ణాటకకు చెందినవారుగా తెలుస్తోంది.

గుల్బర్గా జిల్లా రంజోలికి చెందిన లక్ష్మయ్య-60, వెంకటమ్మ-55, అనిల్‌-32, కవిత-24గా గుర్తించారు. వీరితోపాటు ఓ రెండేళ్ల చిన్నారి ఉన్నట్లు పోలీసుల తెలిపారు. అటు క్లూస్ టీమ్ అక్కడికి చేరుకుని ఇంట్లో కొన్ని ఆధారాలు గుర్తించారు. లభించిన ఆధారాల్లో ఓ ఫోన్ కూడా ఉంది. అందులోని కాల్ డేటా ఆధారంగా విచారణ మొదలుపెట్టారు.