ఐబొమ్మ నిర్వాహకుడు రవి కస్టడీ విచారణ పూర్తయింది. ఇమంది రవి పైరసీ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పలు కీలక వివరాలను సేకరించారు…
హైదరాబాద్ పోలీసులు అతని పాత్రపై కూడా నిగ్గు తేల్చారు.. బెంగళూరు నుంచి ప్రహ్లాద్‌ను పిలిపించి విచారించారు. కస్టడీలో ఉన్న ఇమంది రవి ఎదుటే ప్రహ్లాద్‌ను పోలీసులు ప్రశ్నించి పలు వివరాలు సేకరించారు. అయితే.. 12 రోజులపాటు రవిని విచారించిన సైబర్ క్రైమ్ పోలీసులు.. నేటితో కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరుపర్చారు. వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టుకు రవిని తరలించారు. ఒక్కో కేసులో నాలుగు రోజుల చొప్పున.. మూడు కేసుల్లో 12 రోజులపాటు పోలీసులు విచారించారు.
బెట్టింగ్ యాప్‌లతో కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపణలు వినపడుతున్నాయి..
నీకెవరు చెప్పారంటూ రిపోర్టర్ని ప్రశ్నించిన రవి..
జర్నలిస్టు. ఆరోపణలు వస్తున్నాయి కదా..
రవి..అవన్నీ కోర్టులో మాట్లాడతాను..
జర్నలిస్టు.. మీకు అన్ని మాట్లాడే అవకాశం వచ్చింది ఇక్కడ నుంచి మీరు మాట్లాడొచ్చు.
రవి .. అవన్నీ ఫాల్స్.. అంటూ..
కాగా.. పైరసీ కేసులో అరెస్ట్ అయినా ఐబొమ్మ నిర్వాహకుడు రవి ..
ఏదైనా కోర్టులోనే తేల్చుకుంటానంటూ.
మీడియాపై యాటిట్యూట్ చూపించిన ఇమంది రవి..
సరైన సమయంలో వాస్తవాలు బయటపెడతానంటూ కోర్టు ఆవరణలో పేర్కొన్నాడు..
ఈ సందర్భంగా ఐబొమ్మ రవి .. తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని.. బెట్టింగ్ యాప్స్‌తో సంబంధాలున్నాయని ఎవరు చెప్పారంటూ పేర్కొన్నాడు.. ఏదైనా కోర్టులోనే తేల్చుకుంటా అంటూ ఐ బొమ్మ రవి పేర్కొన్నాడు.. తనపేరు ఐ బొమ్మ రవి కాదని.. పోలీసులు చెబితే నేరం చేసినట్టా..? అంటూ పేర్కొన్నాడు. తాను ఎక్కడికీ పారిపోలేదు..కూకట్‌పల్లిలోనే ఉన్నాని.. వేరే దేశంలో సిటిజన్‌షిప్ మాత్రమే తీసుకున్నా అంటూ ఐబొమ్మ రవి పేర్కొన్నాడు….
నా పేరు రవినా..? ఐ బొమ్మ రవినా..? ఐ బొమ్మ నాదే అనడానికి ఆధారాలు ఉన్నాయా..? ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారు..? అని ప్రశ్నించాడు. అంతేకాక ఏదైనా కోర్టులో తేల్చుకుంటా అంటూ వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
తెలుగు చిత్ర పరిశ్రమంలో అలజడి సృష్టించిన ఐ బొమ్మ రవి 12 రోజుల పోలీస్ కస్టడీ నేటితో ముగిసింది. దాంతో అతడ్ని పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. ఈ క్రమంలో కోర్టు నుంచి బయటకు వస్తూ రిపోర్టర్ అడిగిన పలు ప్రశ్నలకు విసుక్కుంటూ సమాధానం ఇచ్చారు. నా పేరు ఐ బొమ్మ రవినా..? ఐ బొమ్మ నాదే అనడానికి ఆధారాలు ఉన్నాయా..? ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారు..? అని సవాల్ విసిరారు. కోర్టులో చూసుకుంటా అంటూ వెళ్లిపోయారు. మరో ప్రశ్నకు సమాధానం చెప్తూ.. ‘మీ మీడియాకి చెప్పడం వల్ల ఉపయోగం ఏంటి..? మీరేమైనా కోర్టులా అంటూ ఇమంది రవి ఫైర్ అయ్యారు.
“నేను ఎక్కడికీ పారిపోలేదు. ఇన్నాళ్లూ కూకట్ పల్లిలోనే ఉన్నా.. నాపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం.. బెట్టింగ్ యాప్స్ తో సంబంధాలున్నాయని ఎవరు చెప్పారు..? పోలీసులు చెబితే నేరం చేసినట్టేనా.. ఏదైనా కోర్టులోనే తేల్చుకుంటా.. నేను కూకట్ పల్లిలోనే ఉన్నా.. కేవలం వేరే దేశపు సిటిజెన్ షిప్ మాత్రమే తీసుకున్నా..” అని ఐ బొమ్మ రవి పేర్కొన్నారు.
గమనిక..
A TO Z వార్తలు ఏదైనా..
మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959