భారత్ ఏ, ఇంగ్లాండ్ లయన్స్ మధ్య తొలి టెస్టు డ్రా..రాణించిన జైశ్వాల్‌, నితీష్‌..!.

ఆఖరి రోజు భారత యువ బ్యాటర్లు చక్కగా ప్రాక్టీస్‌ చేసుకున్నారు. ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్‌ (68; 8 ఫోర్లు), యశస్వి జైస్వాల్‌ (64; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) సహా టాప్‌-4 బ్యాటర్లు అర్ధసెంచరీలతో కదంతొక్కారు.

ధ్రువ్‌ జురేల్‌ (53 నాటౌట్‌; 4 ఫోర్లు), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (52 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ అర్ధసెంచరీలు సాధించారు. తొలి వికెట్‌కు ఓపెనర్లు 123 పరుగులు జోడిస్తే… జురేల్, నితీశ్‌ అబేధ్యమైన మూడో వికెట్‌కు 91 పరుగులు జతచేశారు. అయితే ఫలితం వచ్చే అవకాశమే లేకపోవడంతో నిరీ్ణత సమయానికి గంటన్నర ముందే మ్యాచ్‌ను ఆపేశారు.

లయన్స్‌కు ఆధిక్యం
అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 527/7తో ఆఖరి నాలుగోరోజు ఆటను కొనసాగించిన లయన్స్‌ 145.5 ఓవర్లలో 587 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ బ్యాటర్‌ జమాన్‌ అక్తర్‌ (41; 4 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుగ్గా ఆడగా, టెయిలెండర్లు ఎడీ జాక్‌ (25; 2 ఫోర్లు), అజిత్‌ సింగ్‌ (27 నాటౌట్‌; 5 ఫోర్లు) పోరాడారు..