టీమిండియా మరో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఐదు వన్డేల సిరీస్‌ను 3-1తో గెలుచుకుంది. గత మ్యాచ్‌లో ఎదురైన ఘోర పరాభావం నుంచి టీమిండియా త్వరగానే తేరుకుంది..ఆదివారం మౌంట్‌మాంగనూయి వేదికగా జరిగిన లోస్కోరింగ్ గేమ్‌లో టీమిండియా 22 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 42.1 ఓవర్లలో 209 పరుగులకు కుప్పకూలింది. అక్షర్ పటేల్(55 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 46), ఇషాన్ కిషన్(58 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46) టాప్ స్కోరర్లుగా నిలిచారు. న్యూజిలాండ్ బౌలర్లలో జాకోబ్ డఫీ(3/60), మిచెల్ సాంట్నర్(3/47) మూడేసి వికెట్లు తీయగా.. మాథ్యూ ఫిషర్(2/28) రెండు వికెట్లు పడగొట్టాడు. బ్లెయిర్ టిక్నర్, మైఖేల్ బ్రేస్‌వెల్ తలో వికెట్ తీసారు..అనంతరం న్యూజిలాండ్ 48 ఓవర్లలో 187 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్(42 బంతుల్లో 5 ఫోర్లతో 31), మిచెల్ సాంట్నర్(31 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 24), నిక్ కెల్లీ(45 బంతుల్లో 2 ఫోర్లతో 24) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(3/30) మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్(2/50), అక్షర్ పటేల్(2/28) రెండేసి వికెట్లు పడగొట్టారు. ఆకిబ్ నబీ(1/37), యశ్ ఠాకూర్, నమన్ ధీర్ తలో వికెట్ తీసారు…ఈ సిరీస్ విజయంతో టీమిండియా చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్ గడ్డపై తొలిసారి వరుసగా టీ20, వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఏడేళ్ల తర్వాత సొంతగడ్డపై న్యూజిలాండ్‌ను వన్డే సిరీస్‌లో భారత్ ఓడించింది..
సిరాజ్ సర్ప్రైజ్ బౌలింగ్..
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ అద్భుత ప్రదర్శనతో మెరిశాడు. తొలి నాలుగు వన్డేలకు బెంచ్‌కే పరిమితమైన సిరాజ్‌కు..
సిరీస్ డిసైడర్ అయిన ఈ మ్యాచ్‌లో తుది జట్టులో అవకాశం దక్కింది. తనకు లభించిన అవకాశాన్ని రెండు చేతులా సద్వినియోగం చేసుకున్న సిరాజ్, కివీస్ బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు.
సిరాజ్ మ్యాజిక్ డెలివరీ.. అలెన్ క్లీన్ బౌల్డ్
210 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు సిరాజ్ ఆరంభంలోనే షాకిచ్చాడు. తొలుత టిమ్ సీఫెర్ట్‌ను ఔట్ చేసిన సిరాజ్.. ఆ తర్వాత కివీస్ డేంజరస్ బ్యాటర్ ఫిన్ అలెన్‌ను అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించాడు..దీంతో 4 పరుగులు చేసిన అలెన్ నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 42.1 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్య చేధనలో భారత బౌలర్ల విజృంభణతో కివీస్ తడబడుతోంది..
ఇషాన్ కంటే ముందున్న అక్షర్ పటేల్
ఈ పరుగుల జాబితాలో అక్షర్ పటేల్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో అతడు 74 పరుగులు చేశాడు. ఐదో వన్డేలో 46 పరుగులతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. మరోవైపు ఇషాన్ కిషన్ కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే 73 పరుగులు సాధించాడు. ఐదో వన్డేలో అతడూ 46 పరుగులు చేసి హాఫ్ సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో వెనుదిరిగాడు. అక్షర్, ఇషాన్ మధ్య తేడా ఒక్క పరుగు మాత్రమే కావడం విశేషం…