ప్రధాని మోదీతో ముగిసిన సీఎం రేవంత్‌రెడ్డి భేటీ..!

ప్రధాని మోదీతో ముగిసిన సీఎం రేవంత్‌రెడ్డి భేటీ..

సుమారు గంటపాటు సాగిన సమావేశం
గ్లోబల్ సమ్మిట్‌కు రావాలని ప్రధానికి ఆహ్వానం
ఖేలో ఇండియా గేమ్స్ ప్రారంభోత్సవానికి ఆహ్వానం
తెలంగాణ పెట్టుబడుల ఆకర్షణపై ప్రధానితో చర్చ
ఎల్‌నినో ప్రభావం, కరువు పరిస్థితులపై ప్రస్తావన
రాష్ట్రానికి ఆర్థిక సాయం అందించాలని కోరిన రేవంత్‌
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై కీలక చర్చ
సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి మాండవీయ
సీఎం వెంట మంత్రులు ఉత్తమ్‌, వాకిటి శ్రీహరి…

భారత ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi)తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరితో కలిసి ఆదివారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, దీర్ఘకాలిక సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, నిధుల కేటాయింపు వంటి పలు కీలక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం వల్ల నెలకొన్న లోటు వర్షపాతం, కరువు పరిస్థితులను సీఎం రేవంత్ రెడ్డి ప్రధానికి వివరించారు. కరువు నివారణ చర్యలు, సాగునీటి అవసరాలు, రైతులను ఆదుకునేందుకు తక్షణమే రూ.30 వేల కోట్ల ఆర్థిక సాయం (ప్యాకేజీ) అందించాలని విజ్ఞప్తి చేశారు….ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి కేంద్రం నుంచి సత్వర అనుమతులు, నిధులతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వ సమ్మతి ఇప్పించేలా చొరవ తీసుకోవాలని కోరారు. సమ్మక్క-సాగర్ ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం (CWC) అనుమతులతో పాటు ఛత్తీస్‌గఢ్ నుంచి నిరభ్యంతర పత్రం (NOC) ఇప్పించాలని విన్నవించారు. గోదావరి-కావేరి నదుల అనుసంధానం అంశంపై కీలక విజ్ఞప్తి చేయడంతో పాటు, ప్రాజెక్టు జలాల్లో తెలంగాణకు 50 శాతం వాటా కేటాయించాలని సీఎం కోరారు. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్‌తో పాటు, డిసెంబర్ 11 నుంచి 22 వరకు జరగనున్న ‘ఖేలో ఇండియా’ యూత్ గేమ్స్ ప్రారంభోత్సవ వేడుకలకు హాజరుకావాల్సిందిగా ప్రధాని మోడీని సీఎం రేవంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు….