రైల్వే ట్రాక్‌పై పేలుడు, పాకిస్థాన్ ఐఎస్ఐ మద్దతుగల ఖలిస్తాన్ అనుకూల ఉగ్రవాద ముఠాను పంజాబ్ పోలీసులు..
పాకిస్థాన్ ఐఎస్ఐ మద్దతుగల ఖలిస్తాన్ అనుకూల ఉగ్రవాద ముఠాను పంజాబ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి ఛేదించారు. నిందితుల నుంచి భారీ పరిమాణంలో ఉగ్రవాద ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు..
రాజస్థాన్‌లో ఇటీవల జరిగిన రైల్వే ట్రాక్ పేలుడు వెనుక పాక్ లింకులు ఉండటం సంచలనం రేపుతోంది. ఈ కేసులో పోలీసులు ఇద్దరిని పంజాబ్‌లో అరెస్ట్ చేశారు. ఆ ఇద్దరు నిందితులకు పాకిస్థాన్‌లోని హ్యాండ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ప్రేమ పేరుతో పాక్ హ్యాండ్లర్లు మహిళతో పరిచయం పెంచుకుని డబ్బులు ఆశ చూపించి.. పేలుడు ఘటనకు ఉపయోగించుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. నిందితురాలి నుంచి రెండు ఆయుధాలు, 46 తూటాలు, రూ.30 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పేలుడులో రెండు రైల్వే స్లీపర్లు ధ్వంసమయ్యాయి…రాజస్థాన్‌లో రైల్వే ట్రాక్‌పై పేలుడు ఘటనకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో పాకిస్థాన్‌కు చెందిన హ్యాండ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్న ఇద్దరిని పోలీసులు పంజాబ్‌లో అరెస్ట్ చేశారు. రాజస్థాన్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), శ్రీగంగానగర్ పోలీసులు, పంజాబ్ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిని 21 ఏళ్ల మహక్దీప్ కౌర్, 22 ఏళ్ల దవీందర్ సింగ్‌గా గుర్తించారు. మహక్దీప్ కౌర్ అనే యువతికి పాకిస్థాన్‌లో ఉన్న ఇద్దరు హ్యాండ్లర్లతో పరిచయం ఏర్పడిందని విచారణలో వెల్లడైంది. వారిలో ఒకరు ‘చాచా’ పేరుతో, మరొకరు ‘షా’ పేరుతో పరిచయం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు..
మొదట ఆమెతో ప్రేమగా మాట్లాడి.. ఆ యువతిని తమ వలలో పడేసుకున్నారని పోలీసులు గుర్తించారు. డబ్బులు ఆశ చూపించి రైల్వే ట్రాక్ పేలుడు ఘటనకు పాల్పడేలా ప్రేరేపించినట్లు అనుమానిస్తున్నారు. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ (ఐఎస్ఐ) ఇదే తరహా పద్ధతులను ఉపయోగిస్తోందని పోలీసులు పేర్కొన్నట్లు సమాచారం. గతంలో గంగానగర్‌కు చెందిన బబిత అనే మహిళను కూడా ఇలాంటి విధానంలో సంప్రదించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తుచేశారు..