న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో టీ20 పోరులో టీమ్ ఇండియా బ్యాటర్లు సునామీ సృష్టించారు. వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు ప్రత్యర్థి బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ టీ20 క్రికెట్లో సరికొత్త రికార్డులు నెలకొల్పారు..టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో భారత్ తరఫున అత్యంత వేగంగా జట్టు వంద పరుగులు (Fastest Team 100s) పూర్తి చేసిన రికార్డును నమోదు చేశారు…
న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్లో మంగళవారం జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ మైదానంలో పరుగుల సునామీ సృష్టించాడు. 199 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ ఊహించని రేంజ్లో స్టార్ట్ ఇచ్చారు.
తొలి ఓవర్ నుంచే కివీస్ బౌలర్లపై విరుచుకుపడిన ఈ జోడీ మ్యాచ్‌ను పూర్తిగా ఏకపక్షం చేసింది. కేవలం 35 బంతుల్లోనే అభిషేక్ శర్మ సెంచరీ పూర్తి చేసుకుని, అత్యధిక టీ20 శతకాలు సాధించిన భారతీయుడిగా విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు…
టీ20ల్లో భారత్ తరఫున అత్యంత వేగంగా
100 పరుగులు సాధించిన జాబితా:
4.5 ఓవర్లు– vs న్యూజిలాండ్, వెల్లింగ్టన్, 2026 (నేటి మ్యాచ్)
5.6 ఓవర్లు – vs ఆఫ్ఘనిస్తాన్, ఢిల్లీ, 2026
6.3 ఓవర్లు – vs ఇంగ్లాండ్, ముంబై (వాంఖడే), 2025
6.3 ఓవర్లు – vs న్యూజిలాండ్, గౌహతి, 2026
6.5 ఓవర్లు – vs నమీబియా, ఢిల్లీ, 2026..
టీమిండియా ఓపెనర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగడంతో పవర్ ప్లేలో భారత్ 118 పరుగులు చేసింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలోనే ఇదే హయ్యెస్ట్ పవర్ ప్లే స్కోర్ కావడం గమనార్హం. ఈ క్రమంలో రొమానియా, ఆస్ట్రేలియా పేరిట ఉన్న అత్యధిక పవర్ ప్లే స్కోర్ రికార్డ్స్‌ను భారత్ అధిగమించింది..
పురుషుల టీ20ల్లో పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన జట్లు:
118/0 – భారత్ vs న్యూజిలాండ్, వెల్లింగ్టన్ (2026)
116/0 – రుమేనియా vs సెర్బియా, సోఫియా (2021) (5.4 ఓవర్లలోనే)
113/1 – ఆస్ట్రేలియా vs స్కాట్లాండ్, ఎడిన్బర్గ్ (2024)
103/1 – జింబాబ్వే vs గాంబియా, నైరోబి (RSC) (2024)
102/0 – దక్షిణాఫ్రికా vs వెస్టిండీస్, సెంచూరియన్ (2023)
100/0 – ఇంగ్లాండ్ vs దక్షిణాఫ్రికా, ఓల్డ్ ట్రాఫోర్డ్ (2025)
100/0 – భారత్ vs అఫ్గానిస్తాన్, ఢిల్లీ (2026)