తీరం దాటిన అర్నబ్‌ తుఫాన్‌…గరిష్ఠంగా గంటకు 150 కి.మీ. వేగంతో ఈదురుగాలులు..!

తీరం దాటిన అర్నబ్‌ తుఫాన్‌.

బలహీనపడి తీవ్ర తుఫాన్‌గా మారిన అర్నబ్..

యానాం-నరసాపురం మధ్య తీరం దాటిన తుఫాన్‌
తీరం దాటిన సమయంలో 125-135 కి.మీ. వేగంతో గాలులు…

గరిష్ఠంగా గంటకు 150 కి.మీ. వేగంతో ఈదురుగాలులు..

Live update .
ఆరు గంటలు పట్టిన తీరం దాటే ప్రక్రియ
అర్నబ్ తుఫాను యానాం వద్ద తీరం దాటడానికి ఆరు గంటల సమయం పట్టింది. మంగళవారం అర్ధరాత్రి 2 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు ఈ అతి తీవ్ర తుఫాను తీరం దాటింది. దీని ప్రభావంతో గంటకు 125-135 కి.మీ. వేగంతో గాలులు వీచాయి. ఈ గాలుల తీవ్రత గరిష్టంగా గంటకు 150 కి.మీ. వరకు చేరింది. ఉదయం 8.30 గంటల తర్వాత ఇది తీవ్ర తుఫానుగా బలహీనపడింది..

అర్నబ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తోంది. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ అతి తీవ్ర తుఫాన్.. విశాఖపట్నం, బాపట్ల మధ్య యానాం దగ్గర్లో బుధవారం ఉదయం తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురవడంతోపాటు భీకరమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తుఫాన్ కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. ఏపీలోని పలు జిల్లాల్లో నేడు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. తుఫాన్ నేపథ్యంలో మంగళ, బుధవారాల్లో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. పలు రైళ్లను సైతం రద్దు చేశారు…

అతి తీవ్ర తుపానుగా బలపడిన ‘అర్నబ్’ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలలో ల్యాండ్‌ఫాల్ (తీరం దాటే ప్రక్రియ) కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ (IMD) బుధవారం వెల్లడించింది. తుపాను కేంద్రం తీరానికి అతి సమీపంలోనే కొనసాగుతోందని, ఉత్తర స్పైరల్ బ్యాండ్ భూభాగంలోకి ప్రవేశించిందని తెలిపింది. ఈ ల్యాండ్‌ఫాల్ ప్రక్రియ మరో మూడు గంటల పాటు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేశారు.

బుధవారం ఉదయం నాటికి ఈ తుపాను నర్సాపూర్‌కు తూర్పుగా 30 కి.మీ., యానాంకు దక్షిణ-నైరుతిగా 45 కి.మీ., కాకినాడకు దక్షిణ-నైరుతిగా 70 కి.మీ, మచిలీపట్నానికి ఈశాన్యంగా 90 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కి.మీ., గరిష్టంగా 140-150 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, బలమైన ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు నేలకూలిపోయాయి.

ఏలూరులో బస్సుపై కూలిన భారీ వృక్షం

తుపాను ప్రభావం ఏలూరు జిల్లాలో ప్రమాదానికి దారితీసింది. బస్సుపై భారీ వృక్షం కూలిపడటంతో వాహనం ముందు భాగం ధ్వంసమైంది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో డ్రైవర్ గాయపడగా, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది…