నేడు న్యూజిలాండ్‌ తో భారత్‌ కీలక పోరు.

నేడు న్యూజిలాండ్‌తో భారత్‌ కీలక పోరు…. ఓడితే ఇక అంతే!

నేడు న్యూజిలాండ్‌తో భారత్‌ ‘ఢీ
ఓడితే సెమీస్‌ అవకాశాలు క్లిష్టం
టి20 ప్రపంచకప్‌లో కీలక మ్యాచ్‌
రాత్రి గం. 7:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం
టి20 ప్రపంచకప్‌లో క్వార్టర్‌ ఫైనల్‌లాంటి సమరం! గెలిచిన జట్టు సెమీఫైనల్‌ చేరేందుకు చేరువయ్యే అవకాశం ఉండగా… ఓడితే మాత్రం పరిస్థితి ఇబ్బందికరంగా మారిపోతుంది. తర్వాతి మ్యాచ్‌లలో ఫలితాలతో పాటు ఎన్నో సమీకరణాలు ముందుకు వస్తాయి. ఈ నేపథ్యంలో తమ రెండో లీగ్‌ మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్‌ తలపడబోతున్నాయి. ఇరు జట్లు తర్వాతి మ్యాచ్‌లలో చిన్న జట్లతో ఆడనున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో ఫలితం ఎంతో కీలకం కానుంది. ఇలాంటి స్థితిలో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తికరం.
2019 వన్డే వరల్డ్‌కప్‌ సెమీస్‌… 2021 టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌… గత రెండు ఐసీసీ టోర్నీలలో న్యూజిలాండ్‌ జట్టు భారత్‌ను దెబ్బ కొట్టి అభిమానుల ఆశలు గల్లంతు చేసింది. మరింత వెనక్కి వెళితే గత టి20 ప్రపంచకప్‌లో కూడా భారత్‌ను సొంతగడ్డపైనే చిత్తు చేసింది.