నేడే భారత్ తొలి మ్యాచ్..!

ఆసియాకప్ 2025 టోర్నీలో భాగంగా భారత జట్టు తన తొలిమ్యాచ్‌ను బుధవారం ఆడనుంది. యూఏఈ జట్టుతో టీమిండియా తలపడనుంది. టీ20 ప్రపంచ ఛాంపియన్ అయిన భారత్ జట్టుకు యూఏఈపై విజయం సాధించడం పెద్ద కష్టం కాకపోవచ్చు.. కానీ, టీ20ల్లో ఏ జట్టునూ మరీ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఈనెల 14న పాకిస్థాన్ జట్టుతో కీలక పోరుకు ముంగిట యూఏఈ మ్యాచ్‌లో భారత్ అన్ని రంగాల్లో ఆధిపత్యం చలాయిస్తూ ఘనవిజయం సాధించి సరైన స్థితిలో ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు..యూఏఈతో భారత జట్టు ఓకే ఒక టీ20 మ్యాచ్ ఆడింది. 2016 ఆసియా కప్ లో జరిగిన ఆ మ్యాచ్ లో తొమ్మిది వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. భారత్ తో మూడు వన్డేలు కూడా ఆడిన యూఏఈ అన్నింట్లో ఓడింది. మరోవైపు భారత్ జట్టు సూపర్ ఫామ్ లో ఉంది. గత ఏడాది టీ20 ప్రపంచ కప్ నుంచి ఆడిన 27 మ్యాచ్ లలో భారత జట్టు మూడు మ్యాచ్ లలో మాత్రమే ఓడిపోయింది..