భారత్ లో 150 కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో సుమారు 60 కోట్ల మంది మాత్రమే దేశ అధికారిక భాష మాట్లాడుతూ, దేశ ప్రజలంతా ఐకమత్యంగా ఉండడం అద్భుతం.. పుతిన్
Putin Praises India's Ancient Civilisation, Linguistic Diversity
ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడినప్పుడు దేశ జనాభా, భాషల గురించి అడిగినట్లు పుతిన్ తెలిపారు..
భారత దేశ సంస్కృతి, నాగరికత, భాషా వైవిధ్యాలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ కొనియాడారు. 150 కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో సుమారు 60 కోట్ల మంది మాత్రమే దేశ అధికారిక భాష మాట్లాడతారని, అయినా సరే దేశ ప్రజలంతా ఐకమత్యంగా ఉండడం అద్భుతమని ప్రశంసలు కురిపించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఓ ఇంటర్వ్యూలో ప్రధాని మోదీకి తనకు మధ్య జరిగిన సంభాషణను చెబుతూ భారతదేశ నాగరికతపై ప్రశంసలు కురిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోను రష్యా అధికారిక మీడియా స్పుత్నిక్ విడుదల చేసింది. ఆ ఇంటర్వ్యూలో పుతిన్ మాట్లాడుతూ.. ‘‘ఉదాహరణకు భారతదేశ నాగరికతను చూడండి.. ఎంతో పురాతనమైనది. ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఆ నాగరికత కోసం తెలుసుకునే కొద్దీ అది నన్ను మరింత ఆకట్టుకుంటోంది. ఈ మధ్య భారత ప్రధాని మోదీతో మాట్లాడినప్పుడు… మీ దేశంలో ఎంత మంది ప్రజలు అధికారిక భాష మాట్లాడతారు ? అని అడిగా.. దాదాపు 60 కోట్ల మంది మాట్లాడతారని మోదీ బదులిచ్చారు. దానికి మొత్తం దేశ జనాభా ఎంత? అని నేను అడిగితే 150 కోట్లు అని మోదీ చెప్పారు. ఏంటి మొత్తం జనాభాలో మూడో వంతు మంది మాత్రమే అధికారిక భాష మాట్లాడితే మిగిలిన వాళ్లు ఏ భాష మాట్లాడతారని మోదీని అడిగా. మిగిలిన ప్రజలు తమ మాతృభాష మాట్లాడతారని ఆయన చెప్పారు..
భిన్నత్వంలో ఏకత్వం. ఇన్ని విభిన్న భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు ఉన్నప్పటికీ ప్రజలంతా ఒకే దేశంగా కలిసిమెలిసి జీవించడం నిజంగా అద్భుతమని, ఇది ఇతర దేశాలకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని ఆయన భారతీయ సంస్కృతి పై మాట్లాడినట్లుగా వార్తా కథనాలు విలువడటం విశేషం..
“ఇది మీకు ఆశ్చర్యంగా అనిపించడం లేదా? నిజంగానే ఆశ్చర్యంగా ఉంది!” అని పుతిన్ ఆ ఇంటర్వ్యూలో అన్నారు..
భాష. హిందీ దేశంలో అత్యధికంగా మాట్లాడే భాష. ఇది 22 షెడ్యూల్డ్ భాషలలో ఒకటి మరియు కేంద్ర అధికారిక భాష.
2011 జనాభా లెక్కల ప్రకారం, 528.35 మిలియన్ల మంది, అంటే భారతదేశ జనాభాలో 43.63 శాతం మంది హిందీని తమ మాతృభాషగా పేర్కొన్నారు. కాగా, 691.56 మిలియన్ల మంది, అంటే 57.11 శాతం మంది దీనిని తమ మొదటి, రెండవ లేదా మూడవ భాషగా మాట్లాడారు.