ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు కానిస్టూషన్ క్లబ్ లో “ఇండియా కూటమి” సమావేశం..
మొత్తం 23 పార్టీలు సమావేశానికి హాజరవుతాయంటున్న కాంగ్రెస్…
_• ఇండియా కూటమికి దూరమని ఇప్పటికే ప్రకటించిన డిఎంకె._
_• కాంగ్రెస్ వైఖరిపై అసంత్రుప్తిగా వున్న కమ్యూనిస్టు పార్టీలు, జెఎంఎం_
_• అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఘోర పరజయాన్ని మూటగట్టుకున్న టిఎంసి_
_• ఇలాంటి రాజకీయ పరిణామాలు, పరిస్థితుల నేపథ్యంలో జరుగుతున్న ఇండియా కూటమి సమావేశం..
మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటోంది. అయితే కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న డీఎంకే మాత్రం ఈ సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించింది. అలాగే గత కొన్నాళ్లుగా ఇండియా కూటమికి దూరంగా ఉంటున్న ఆప్ కూడా ఈ సమావేశానికి దూరంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇక, తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విజయ్ నేతృత్వంలోని టీవీకే ఈ సమావేశానికి హాజరుకాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి..
టీవీకేను ఇండియా కూటమిలో చేర్చుకోవడంతో గుర్రుగా ఉన్న డీఎంకే ఈ సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది (DMK exit). తమిళనాడు ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీ, విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మద్దతు ఇవ్వడాన్ని డీఎంకే వ్యతిరేకించింది. అలాగే ఈ సమావేశానికి ముందు కాంగ్రెస్, వామపక్షాల మధ్య విభేదాలు కూడా బయటపడ్డాయి. కేరళ ఎన్నికల ప్రచారంలో పరస్పరం చేసుకున్న ఆరోపణలపై సీపీఎం, కాంగ్రెస్ నుంచి వివరణ కోరింది.