INDIA) కూటమి సమావేశానికి సీఎం విజయ్‌కు దక్కని ఆహ్వానం..!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించి, కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోలీవుడ్ స్టార్, సీఎం జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కజగం’ (టీవీకే) పార్టీకి ఊహించని పరిణామం ఎదురైంది..కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఉమ్మడి వ్యూహాన్ని రచించేందుకు నేడు (జూన్ 8) ఢిల్లీలో జరుగుతున్న కీలక ‘ఇండియా’ (INDIA) కూటమి సమావేశానికి సీఎం విజయ్‌కు ఆహ్వానం దక్కలేదు. తమిళనాడులో కాంగ్రెస్‌కు అత్యంత ఆప్తుడిగా మారిన విజయ్ ఈ భేటీకి హాజరుకాకపోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ సమావేశానికి విజయ్‌ను పిలవకపోవడానికి గల కారణాలను కాంగ్రెస్ వర్గాలు తెలియజేశాయి. ప్రస్తుతం లోక్‌సభ లేదా రాజ్యసభలో ప్రాతినిధ్యం ఉన్న రాజకీయ పార్టీలను మాత్రమే ఈ భేటీకి ఆహ్వానించామని కూటమి నేతలు తెలిపారు. అంతేకాకుండా, ప్రస్తుతానికి టీవీకే పార్టీ ఇంకా అధికారికంగా ఇండియా కూటమిలో భాగస్వామి కాలేదనే నెపంతోనే ఆయనకు ఈ మొండిచేయి ఎదురైనట్లు తెలుస్తోంది.