పాక్ పై భారత్ ఘనవిజయం…దెబ్బకు దెబ్బ పడిందిగా పాకిస్తాన్ కి…!
Champions Trophy 2025: Centurion Kohli.
ఛాంపియన్స్ ట్రోఫీలోనే హై వోల్టేజ్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరుగుతోంది. టాస్ నెగ్గిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్‌లో నెగ్గి ఊపు మీదున్న టీమ్ఇండియా ఈ విజయంతో సెమీస్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది….
ఛాంపియన్స్ ట్రోపీలో భారత్ రెండో విజయం
బంగ్లాదేశ్‌పై మొదటి విజయం తర్వాత పాక్‌పై వరుసగా రెండో విజయం
242 పరుగుల విజయలక్ష్యాన్ని సులభంగా ఛేదించిన భారత్
కోహ్లీ సెంచరీ
111 బంతుల్లో వంద పరుగులు కొట్టిన కోహ్లీ
వరుసగా రెండు మ్యాచ్ ఓడిన పాకిస్తాన్
మెరుగ్గా భారత్ సెమీస్ అవకాశాలు.
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 14 వేల పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో వ్యక్తిగత స్కోరు 15 పరుగుల వద్ద కోహ్లీ ఈ మైలురాయిని చేరుకున్నాడు. హారిస్ రవూఫ్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి సచిన్, సంగక్కరల రికార్డులను బ్రేక్ చేశాడు..
సచిన్ టెండూల్కర్ 350 ఇన్నింగ్స్‌ల్లో 14 వేల పరుగుల మైలురాయిని చేరుకోగా కోహ్లీ 287 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు. ఇక వన్డేల్లో ఇద్దరు క్రికెటర్లు మాత్రమే 14 వేల కంటే ఎక్కువ పరుగులు చేయగా ఇప్పుడు కోహ్లీ మూడో ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు..
వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు
సచిన్ తెందూల్కర్ – 18426 పరుగులు
కుమార సంగక్కర – 14234 పరుగులు
విరాట్ కోహ్లీ – 14000* పరుగులు
రికీ పాంటింగ్ – 13704 పరుగులు
సనత్ జయసూర్య – 14430 పరుగులు..
తన కెరీర్లో 51వ సెంచరీ సాధించాడు. “ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్“ గా నిలిచాడు. అతడికి శ్రేయస్ అయ్యర్ (56), శుభ్‌మన్ గిల్ (46) సహకరించారు. రోహిత్ శర్మ (20), హార్దిక్ (8) త్వరగానే అవుట్ అయ్యారు. కోహ్లీ, గిల్, శ్రేయస్ పిచ్‌ను పూర్తిగా అర్థం చేసుకుని పరుగులు రాబట్టారు..కోహ్లీ, శ్రేయస్ పాక్ బౌలర్లకు ఎలాంటి అవకాశమూ ఇవ్వకుండా చక్కటి సమన్వయంతో ఆడారు. ముఖ్యంగా కోహ్లీ చాలా రోజుల తర్వాత తన ట్రేడ్ మార్క్ షాట్లతో అలరించాడు. అద్భుతమైన కవర్‌డ్రైవ్‌లతో ఎంతో ఆత్మవిశ్వాసంగా ఆడాడు. పాక్ ఫీల్డర్లు క్యాచ్ వదిలేయడం కూడా కోహ్లీకి కలిసి వచ్చింది. మరోవైపు శ్రేయస్ కూడా సాధికారికంగా ఆడాడు. అనవసర షాట్లు కొట్టకుండా సమయోచితంగా రాణించాడు. 56 పరుగులు చేసి చివర్లో అవుట్ అయ్యాడు. పాక్ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. దీంతో భారత్ 42.3 ఓవర్లలోనే పాకిస్తాన్ నిర్దేశించిన టార్గెట్‌ను చేరుకుంది.
Champions Trophy 2025: Centurion Kohli.
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రిజ్వాన్ (77 బంతుల్లో 46), షకీల్ (76 బంతుల్లో 62) చెప్పుకోదగ్గ స్కోర్లు సాధించారు. కుల్దీప్ మూడు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు దక్కించుకున్నారు. హర్షిత్ రాణా, జడేజా, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ పడగొట్టారు. అక్షర్ పటేల్ అద్భుత ఫీల్డింగ్ చేసి ఇద్దరిని రనౌట్ చేశాడు. ఈ టోర్నీలో భారత్ తన తర్వాతి మ్యాచ్‌ను న్యూజిలాండ్‌తో మార్చి 2వ తేదీన ఆడబోతోంది…
Virat Kohli is the player of the match.