భారత్, చైనా, యూరోపియన్ యూనియన్‌తో సహా 16 దేశాలపై ట్రంప్ సుంకాలు..!

భారత్, చైనా, యూరోపియన్ యూనియన్‌తో సహా 16 దేశాల్లోని అధిక పారిశ్రామిక సామర్థ్యంపై విచారణ ప్రారంభించిన ఎనిమిది నెలల తర్వాత, యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ ఈ కేసులో తన పరిశోధనల ఫలితాలను వెల్లడించి, సుంకాలను ప్రతిపాదించడానికి సిద్ధంగా ఉంది..ఈ వారం అమెరికా సుంకాలను పెంచడానికి సిద్ధమవుతోందని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొనగా, ఇది మంగళవారం నాడే అమల్లోకి రావచ్చని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. సుమారు 45 రోజుల్లో తుది సుంకాలను ప్రకటించడానికి ముందు, పలు విచారణలు జరగనున్న ఈ దర్యాప్తు ఫలితాలను భారత అధికారులు నిశితంగా గమనిస్తున్నారు. ‘పరస్పర సుంకాలను’ విధించడానికి అత్యవసర అధికారాల వినియోగంపై యూఎస్ సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన తర్వాత, ట్రంప్ ప్రభుత్వం సెక్షన్ 301 కింద రెండు విచారణలను ప్రారంభించింది. ..

బ్లూమ్‌బెర్గ్’, ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ (డబ్ల్యూఎస్‌జే) కథనాలు వెల్లడించాయి. మంగళవారం నుంచే వాషింగ్టన్ ఈ కొత్త సుంకాలను ప్రకటించే అవకాశం ఉంది. చైనా, యూరోపియన్ యూనియన్ (EU) సహా 16 ప్రధాన వాణిజ్య భాగస్వామ్య దేశాల్లోని పారిశ్రామిక రాయితీలపై నెలల తరబడి సాగిన దర్యాప్తు నివేదికను అమెరికా వాణిజ్య ప్రతినిధి (USTR) జేమిసన్ గ్రీర్ ఈ వారంలోనే విడుదల చేయనున్నారు….

భారత్, వియత్నాంలపై అధిక సుంకాల ముప్పు.

కొత్త ప్రతిపాదనల ప్రకారం యూరోపియన్ యూనియన్, జపాన్, దక్షిణ కొరియా దేశాలపై 15 శాతం లేదా అంతకంటే తక్కువ సుంకాలు విధించే అవకాశం ఉన్నట్లు న్యూస్18 ఇంగ్లీష్ కథనం పేర్కొంది. అయితే భారత్, వియత్నాం దేశాలపై వీటికంటే ఎక్కువ స్థాయిలో టారిఫ్‌లు పడొచ్చని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. చైనాపై మిగతా దేశాల కంటే అత్యధిక సుంకాలు ఉండొచ్చని అంచనా. భారత్‌పై కచ్చితంగా ఎంత శాతం సుంకం విధిస్తారనేది ఇంకా స్పష్టత రాలేదు…