దివంగత ప్రధాని, తన తండ్రి రాజీవ్‌గాంధీ హత్యపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. రాజీవ్ హత్యకు గురి కావటానికి వీలుగా కావాలనే ఆయనకున్న భద్రతను అప్పట్లో తొలగించారని పేర్కొన్నారు. హత్య జరగటానికి అనుకూలమైన పరిస్థితులను సృష్టించారని చెప్పారు. తన తల్లి సోనియాగాంధీ, సోదరి ప్రియాంకాగాంధీతో కలిసి మాట్లాడుకుంటున్న సందర్భంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సంభాషణ తాలూకు వీడియోను మంగళవారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పేరుతో సోనియాగాంధీ తన జ్ఞాపకాలతో కూడిన పుస్తకాన్ని ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే, వారి మధ్య సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. 1991 మే 21వ తేదీన రాజీవ్ హత్య జరగటానికి ముందున్న పరిస్థితుల గురించి వారు మాట్లాడుకున్నారు. ఆ నెల ప్రారంభంలో బిహార్ పర్యటనకు రాజీవ్‌గాంధీ వెళ్లగా.. విదేశాల్లో చదువుకుంటున్న రాహుల్ అప్పుడే స్వదేశానికి వచ్చి తండ్రి వెంట బిహార్‌కు వెళ్లిన సంగతిని సోనియా గుర్తు చేశారు. ‘అప్పట్లో రాజీవ్ ప్రతిపక్షనేతగా ఉన్నారు. బీజేపీగానీ, మరో ప్రత్యర్థి పార్టీగానీ అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు రాజీవ్ భద్రతను పట్టించుకునేవి కావు. బిహార్‌లోనూ అదే జరిగింది. పర్యటనలో భాగంగా ఒపెన్‌టాప్ జీప్‌లో వెళ్తున్నప్పుడు రాజీవ్‌పైకి ప్రత్యర్థి పార్టీల వాళ్లు రాళ్లు విసిరారు…
1984లో ఇందిరాగాంధీ హత్య తర్వాత ప్రధాని బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ, 1989 ఎన్నికల్లో ఓటమిపాలై ప్రతిపక్ష నేతగా మారారు. ఆ సమయంలో ఆయనకున్న కమాండో భద్రతను తగ్గించడంపై రాహుల్ గాంధీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 1991 నెలలో శ్రీపెరంబదూర్‌లో జరిగిన ఆత్మాహుతి దాడికి ముందు రాజీవ్ గాంధీతో కలిసి బీహార్ ఎన్నికల ప్రచారానికి రాహుల్ కూడా వెళ్లారు. ఆ పర్యటన అత్యంత భయానకంగా సాగిందని సోనియా గాంధీ గుర్తుచేసుకున్నారు. ఓపెన్ టాప్ జీపులో ప్రచారం చేస్తున్న సమయంలో కొందరు రాళ్లు విసిరారని, ఆయన భద్రత విషయంలో అప్పటి బీహార్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. ఆ పర్యటన తర్వా త రాహుల్ నాతో ..‘‘అమ్మా, నాన్న భద్రత విషయంలో మనం ఏదో ఒకటి చేయకపోతే, త్వరలోనే ఆయన అంత్యక్రియలకు రావాల్సి వస్తుంది’’ అని చెప్పినట్లు సోనియా గాంధీ గుర్తుచేసుకున్నారు.