చివరిదైన నాలుగో టి20 జోహెన్నేస్ బర్గ్ లో జరుగుతోంది.. ఈ క్రమంలో టాస్ గెలిచిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. గత మూడు మ్యాచ్లలో దక్షిణాఫ్రికా టాస్ గెలవగా..
అభిషేక్ శర్మ భారీ సిక్స్
సౌతాఫ్రికా బౌలర్లతో మరోసారి టీమిండియా బ్యాటర్లు ఆటాడుకున్న వేళ.. ఓపెనర్ అభిషేక్ శర్మ వార్తల్లో నిలిచాడు. ఈ మ్యాచ్ లో 18 బంతుల్లో 4 సిక్స్ లు, 2 ఫోర్లతో 36 రన్స్ చేశాడు. అయితే ఆ నాలుగు సిక్స్ లలో ఒకటి ఏకంగా గ్రౌండ్ బయట పడింది. ఐదో ఓవర్ తొలి బంతికి అతడీ సిక్స్ కొట్టాడు.
రైట్ ఆర్మ్ పేస్ బౌలింగ్ లో ముందుకు దూసుకొచ్చిన అభిషేక్.. ఎక్స్ట్రా కవర్ మీదుగా ఈ సిక్స్ బాదాడు. అతడు ఎంత బలంగా కొట్టాడంటే.. ఆ బాదుడికి బంతికి స్టేడియం బయట పడింది. రీప్లేల్లో బంతి స్టేడియం పక్కనే ఉన్న ఇంటి దగ్గర పడినట్లు తేలింది..
తొలుత ఓపెనర్ సంజు శాంసన్ కి ఒక లైఫ్, అలాగే అభిషేక్ శర్మ కి కూడా మరో లైఫ్ వచ్చింది. అభిషేక్ శర్మ క్యాచ్ మిస్ చేశారు. దానిని ఛాన్స్ గా తీసుకొని సిక్సర్లు, ఫోర్లతో రెచ్చిపోయాడు. 18 బంతుల్లో 36 పరుగులు చేసి కీపర్ కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.
దీంతో భారత్ స్కోరు కాస్త తగ్గుముఖం పడుతోంది. అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ తో అభిమానులు ఎంజాయ్ చేశారు. మరో ఓపెనర్ సంజు శాంసన్ పోర్లతో రెచ్చిపోతున్నాడు…
సంజు శాంసన్, తిలక్ వర్మ.. సౌతాఫ్రికా బౌలర్లను ఆటాడుకున్నారు. ఇద్దరు సెంచరీలతో చెలరేగారు. టీ20 చరిత్రలో భారీ స్కోరును సైతం నమోదు చేశారు.
బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో మైదానంలో తిలక్ వర్మ సంబురాలు చేశారు. ఓవరాల్గా 20 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది టీమిండియా. సంజు శాంసన్(109), తిలక్ వర్మ(120) పరుగులతో జట్టుకు భారీ స్కోరు అందించారు. సౌతాఫ్రికా బౌలర్లలో లుతో సిపామ్లా ఒక వికెట్ తీయగా.. మిగిలిన బౌలర్లంతా చేతులెత్తేశారు. నాలుగు మ్యాచుల సీరిస్లో ఇప్పటికే 02-1తో టీమిండియా లీడ్లో ఉంది.