ఇందిరమ్మ ఇల్లు రాలేదని వాటార్ ట్యాంకు ఎక్కి హల్ చల్..

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం లో ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఓ వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి హల్ చల్ చేశాడు. వెలుగు పల్లి కి చెందిన కనకయ్య (33) తనకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని కొందరు తన వద్ద డబ్బులు తీసుకొని మోసం చేశారని. మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్ల లిస్టులో తన పేరు లేకపోవడంతో ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నించినట్టుగా తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కనకయ్య కిందకి దిగాడు.